దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు హరీశ్‌రావుకు కలిసిన సూర్యవంశ అరెకటిక సంఘ సభ్యుల ఆహ్వానం
దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు హరీశ్‌రావుకు కలిసిన సూర్యవంశ అరెకటిక సంఘ సభ్యుల ఆహ్వానం
గజ్వేల్ ; గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో సూర్యవంశ ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ సంఘం సభ్యులు శుక్రవారం సిద్దిపేటలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్సవాల వివరాలను ఆయనకు తెలియజేసి, ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కళ్యాణ్కార్ పద్మబాయి నర్సింగ్‌రావు, మాజీ కౌన్సిలర్ కళ్యాణ్కార్ శ్రీనివాస్‌తో పాటు సూర్యవంశ ఆరెకటిక సంఘం సభ్యులు జమాల్‌పూర్ విఠల్, కళ్యాణ్కార్ మహేష్, జమాల్‌పూర్ ప్రదీప్, సాయి మహేష్, ఎర్రవాడ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.