దీన్‌దయాళ్ ఆశయాలే స్ఫూర్తి
ముస్తాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు
సూర్య, ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల: పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతికుమార్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్రాంతికుమార్ మాట్లాడుతూ.. దేశసేవకు జీవితాన్ని అంకితం చేసిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ‘ఏకాత్మ మానవతావాదం, అంత్యోదయ’ సిద్ధాంతాలు నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు.సమాజంలోని చివరి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు అందించడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. 2047 నాటికి ఆత్మనిర్భర్, సమృద్ధ భారత్ నిర్మాణానికి బీజేపీ కార్యకర్తలు నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మల్లరపు సంతోష్ రెడ్డి మెరుగు అంజగౌడ్ గోపి, జిల్లెళ్ల మల్లేశం,బాధ నరేష్, కోలా కృష్ణా, ధీటి సత్యం, మార్గాల వేణుగోపాల్, వినయ్, యాదగిరి, వినయ్, ప్రవీణ్,ఒరగంటి సత్యం, పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.