దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు
దెబ్బతిన్న రోడ్లకు మరమ్మ త్తులు.
దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో శ్రీరామ కాలనీలో దెబ్బతిన్న రోడ్లకు జిహెచ్ఎంసి అధికారుల సహకారంతో తాత్కాలిక మరమ్మత్తులు చేయిస్తున్నట్లు జల్ పల్లి మాజీ కౌన్సిలర్ కే.లక్ష్మీనారాయణ అన్నారు. జిహెచ్ఎంసి జల్ పల్లి సర్కిల్ పరిధి, శ్రీ రామ కాలనీలో భారీ వాహనాల రాకపోకల కారణంగా ప్రధాన రహదారుపై పగుళ్లు ఏర్పడి, కొంతమేర రోడ్లు పూర్తిగా దెబ్బతిని గుంతలుగా మారాయన్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ విషయంపై జల్ పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ను సంప్రదించి, రోడ్ల మరమ్మత్తులు చేయాలని వినతి పత్రం అందించామన్నారు. ఈ మేరకు సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వెంకట్రామ్ స్పందించి శుక్రవారం రోడ్లకు తాత్కాలిక మరమ్మత్తులు చేయించారని మాజీ కౌన్సిలర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ రతన్, రంగారెడ్డి జిల్లా చేనేత విభాగం అధ్యక్షులు మస్న రవికుమార్, మురళి, గుద్దేటి బిక్షపతి, నామని కృష్ణ, పరమేష్, కంది బిక్షపతి, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.
-అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.