దెబ్బడగూడలో లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం
దెబ్బడగూడలో లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం
రెండు రోజుల్లోనే నూతన
ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు
కందుకూరు మండలం దెబ్బడగూడలో విద్యుత్ లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించినట్లు సర్పంచ్ మల్లేపల్లి బాల్రాజ్ తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సహకారంతో, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని దెబ్బడగూడలో 160 కేవీ ట్రాన్స్ఫార్మర్ను, గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన మహమ్మద్నగర్లో 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. బుధవారం ట్రాన్స్ఫార్మర్లను ఏనుగు జంగారెడ్డి నాయకులతో కలిసి ప్రారంభించారు.
లో వోల్టేజ్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడటంతో పాటు టీవీలు వంటి విద్యుత్ పరికరాలు దెబ్బతింటున్నాయని, రానున్న వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రజల అభ్యర్థన మేరకు నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల సమస్యను వెంటనే స్పందించి రెండు రోజుల్లో పరిష్కరించిన నాయకులకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చెంచు అంజమ్మ నరసింహ, వార్డు సభ్యులు ఉప్పల శారద నరసింహ, నాయకులు ఎన్. జంగయ్య, ఈ. శేఖర్రెడ్డి, సామ హనుమంతరెడ్డి, యువ నాయకుడు చెంచు అనిల్ తదితరులు పాల్గొన్నారు.
టి. శ్రీనివాస్ :మేజర్ న్యూస్, కందుకూరు