BREAKING
యూపీలోని బల్లియాలో సంచలనం: అదనపు కట్నం కోసం భార్యను కాల్చి చంపిన కేసులో భర్త, బావ, తోడికోడలికి జీవితఖైదు! ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం భారత యువతపై ప్రతీకార చర్యలన్న ఐరాస నివేదికను తీవ్రంగా తిరస్కరించిన భారత్: ఆధారాల్లేని వదంతులేనని గట్టి కౌంటర్! కూటమి ప్రభుత్వం కుట్రలకు భయపడేది లేదు కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ట్రంప్ ఆంక్షల మినహాయింపు భారత్‌కు తాత్కాలిక ఊరట మాత్రమే: శాశ్వత భరోసా కాదన్న జీటీఆర్‌ఐ నివేదిక! రాయదుర్గం మున్సిపాలిటీలో రెండో రోజు నామినేషన్ల స్వీకరణ యాచారంలో అమ్మవారికి ఘనంగా సామూహిక కుంకుమార్చన  ముడిచమురు సరఫరాపై నీలినీడలు: మళ్లీ $110 మార్కును తాకిన బ్రెంట్ క్రూడ్ ధరలు.. ఇంధన సంక్షోభంపై పెరుగుతున్న ఆందోళనలు! ఐడీబీఐ బ్యాంక్ వాటాల విక్రయం: 2003 చట్టం, హైకోర్టు తీర్పును ప్రస్తావించిన కేంద్రం! డాటా సెంటర్ల ఏర్పాటుతో షాద్నగర్ ప్రాంతం అతలాకుతలం పశ్చిమాసియా సంక్షోభం వేళ బాగ్దాద్‌కు ఇరాన్ విదేశాంగ మంత్రి: ఓఐసీ అత్యవసర సదస్సులో పాల్గొననున్న అబ్బాస్ అరఘ్చీ.. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ బలగాలు తక్షణమే వెనక్కి తగ్గాలి: ఖతార్ విదేశాంగ మంత్రి తీవ్ర హెచ్చరికలు.. ఇరాన్‌పై అణుదాడి అవకాశాన్ని కొట్టిపారేసిన డొనాల్డ్ ట్రంప్: శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గా భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దంపతులు పట్లోళ్ల అనుపమ సంజీవరెడ్డి పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు: హెబ్రోన్‌లో ఇజ్రాయెల్ సెట్లర్ల బీభత్సం.. ఇరాన్‌పై అణుదాడిని తోసిపుచ్చిన ట్రంప్!

డాటా సెంటర్ల ఏర్పాటుతో షాద్నగర్ ప్రాంతం అతలాకుతలం

Select Suryaa Now
డాటా సెంటర్ల ఏర్పాటుతో షాద్నగర్ ప్రాంతం అతలాకుతలం

 

ఇప్పటికే అడుగంటకపోయిన భూగర్భ జలాలు.

*లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం దేనికి సంకేతం.?

రైతన్నకు సాగునీటి కోసమా…లేక డేటా సెంటర్ల కోసమా..?

ప్రజల ప్రశ్నలకు పాలకులు సమాధానం చెప్పాలి.

షాద నగర్ అసెంబలీ  కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి  పసుపుల ప్రశాంత్ ముదిరాజ్ డిమాండ్…

షాద్ నగర్ ప్రాంతం సముద్ర మట్టానికి ఎంతో ఎత్తయిన ప్రాంతమని ఇప్పటికే ఈ ప్రాంతంలో నీటి గోస అలుముకుందని భవిష్యత్తులో త్రాగేందుకు కూడా నీటి చుక్క దొరకని దుస్థితిలోకి ఈ ప్రాంతం నెట్టివేయబడుతుందని  షాద్ నగర్ అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి పశువుల ప్రశాంత్ ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. డేటా సెంటర్ల ఏర్పాటు తో ఏర్పడే అసలపై ఆందో ళన చెందుతూ ఒక ప్రకటన విడుదల చేశారు.  పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపడితే ఈ ప్రాంతంలో రైతులకు సాగునీరు ప్రజలకు త్రాగునీరు ఉపయోగపడుతుందని కానీ ఈ మధ్యకాలంలో షాద్ నగర్ , షాబాద్ చుట్టుప్రక్కల వెలుస్తున్న డేటా సెంటర్లతో ప్రజల్లో భయాందోళన మొదలైందని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించి ఆ రిజర్వాయర్ నుంచి వచ్చే నీటిని డేటా సెంటర్లకు ఉపయోగిస్తారనే అనుమానం కలుగుతుందన్న   ప్రశ్నలకు పాలకులు సమాధానం చెప్పి ప్రజల్లో ఉన్న భయాందోళనను నివృత్తి చేయాలని కోరారు. డేటా సెంటర్లకు  పెద్ద ఎత్తున నీటి వాడకం అవసరం ఉంటుందని మరి ఈ ప్రాంతంలో 2000 ఫీట్ల లోతులో బోర్లు వేసిన చుక్క నీరు వచ్చే అవకాశం లేదని అలాంటప్పుడు డేటా సెంటర్లకు నీళ్లు ఎక్కడినుండి అందిస్తారని షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఈ ప్రశ్న ప్రజల్లో తలెత్తుతుందని పాలకులు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఇప్పటికే ఈ ప్రాంతమంతా వివిధ కాలుష్యకారక పరిశ్రమలతో నిండిపోయిందని దానికి తోడు డేటా సెంటర్లు రావడంతో ఈ ప్రాంత మరింత కాలుష్యంతో నిండిపోయే అవకాశం ఉందని పాలకులు మరోసారి ఆలోచించి డాటర్ సెంటర్లో ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి షాద్నగర్ ప్రాంతం ప్రజల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు .లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

నరసింహ రెడ్డి మేజర్ న్యూస్…..