విశ్వకర్మ ఏక్తాయాత్ర 1700 కిలోమీటర్లు మహాపాదయాత్ర
తలకొండపల్లి రంగారెడ్డి : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు జనాభా ప్రాతిపదికన విశ్వకర్మలకు 5శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ హైదరాబాదు నుండి ఢిల్లీ బయల్దేరిన విశ్వకర్మ ఏక్తా యాత్ర శనివారం మధ్యప్రదేశ్లోని సియోని పట్టణానికి చేరుకుంది. డూన్డా లోని విశ్వకర్మ థామ్ మందిరంలో కోమల్ విశ్వకర్మ, రామ బరోజ్ విశ్వకర్మ, నారాయణ విశ్వకర్మ, ఆశిష్ విశ్వకర్మ, ఇతర సంఘీయులు మరియు గ్రామస్తులతో కలిసి స్వాగతం పలికారు. విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ చీఫ్ & ఫౌండర్ బ్రహ్మశ్రీ విశ్వనాధుల పుష్పగిరి నేతృత్వంలో హైదరాబాదులోని బోరబండలో సెప్టెంబర్ 17న ప్రారంభమైన ఈ విశ్వకర్మ ఏక్తాయాత్ర తెలంగాణ, మహారాష్ట్రలో ప్రయాణించి మధ్యప్రదేశ్ చేరుకుంది. మహా పాదయాత్రలో సభ్యులు కంచుపాడు రామయ్య చారి, సత్యమాచారి, నరేష్ చారి, రవి చారి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వనాథుల పుష్పగిరి మాట్లాడుతూ దేశంలో విశ్వకర్మలు తమ పంచకర్మలు అయిన ఒకే వృత్తి చేస్తున్నప్పటికీ విభిన్న భాషలలో వివరణ పేర్లతో పిలువబడుతుండడం వల్ల జాతీయస్థాయిలో సరైన గుర్తింపు నోచుకోలేకపోతున్నామని, తమకు రాజ్యాంగబద్ధంగా అందాల్సిన ప్రతిఫలాలు అందడం లేదని, ఆత్మగౌరవం మరియు గుర్తింపు కోసం 25 డిమాండ్లతో హైదరాబాదు నుండి ఢిల్లీ వరకు పాదయాత్ర చేపడుతున్నమని తెలియజేశారు.
- చప్పిడి తిరుపతి మేజర్ న్యూస్.