BREAKING
హోర్ముజ్ జలసంధిలో సముద్రపు మందుపాతర తాకి భగ్గుమన్న ఆయిల్ సూపర్‌ట్యాంకర్: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సంచలన ప్రకటన! రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షలు, సుంకాల రద్దు: అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్‌కు దక్కిన భారీ దౌత్య, ఆర్థిక ఊరట! ఇల్లినాయిస్ హిందూ దేవాలయంపై దాడి కుట్ర: ఫెడరల్ విద్వేష నేరంగా పరిగణించి ఎఫ్‌బీఐ దర్యాప్తు చేయాలని అమెరికా చట్టసభ సభ్యుల డిమాండ్! సీనియర్ ఐపీఎస్ అధికారి నుంచి రూ. 5 కోట్ల పరువునష్టం నోటీసు: బీహార్ సీఎంకు ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ బహిరంగ లేఖ! ఎల్ నినో ప్రభావం ఉన్నా రాష్ట్రంలో సోయాబీన్ దిగుబడి ఆశాజనకం: అంతర్జాతీయ సదస్సులో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ వెల్లడి! హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు సిద్ధం: ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ స్పష్టత! కనకదుర్గమ్మ దర్శించుకున్న హైకోర్టు జడ్జి లక్ష్మణరావు అమెరికా ఎన్నికల్లో అక్రమంగా ఓటు వేసిన భారత సంతతి వ్యక్తి అరెస్ట్: కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఫెడరల్ అధికారులు రాపిడ్‌కాన్వాస్ ఖాతాలో 29 మిలియన్ డాలర్ల నిధులు: వెర్టెక్స్ వెంచర్స్ నేతృత్వంలో సిరీస్-బి రౌండ్ పూర్తి.. 52.5 మిలియన్ డాలర్లకు చేరిన మొత్తం సమీకరణ! ఎఫ్‌ఎస్‌ఐబీని పునర్వ్యవస్థీకరించిన కేంద్ర ప్రభుత్వం: నూతన ఛైర్మన్‌గా మాజీ ఎంఎస్ఎంఈ కార్యదర్శి ఎస్‌సీఎల్ దాస్ నియామకం! చైనాలో మాస్టర్‌కార్డ్, సిటీగ్రూప్‌లకు మార్కెట్ అనుమతులపై అమెరికా ఒత్తిడి: బ్యాంకాక్ ద్వైపాక్షిక భేటీల్లో కీలక అంశం 100 డాలర్ల మార్కును దాటిన అమెరికా క్రూడాయిల్: హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడుల తీవ్రత.. ఈ వారంలో డబ్ల్యూటీఐ 9 శాతం జంప్! నకిలీ పోలీస్ అవతారం ఎత్తి మోసం నిర్మలా సీతారామన్ వాణిజ్య అడ్డంకుల ప్రస్తావనపై స్పందించిన చైనా: పరస్పర ఆర్థిక ఆందోళనల పరిష్కారానికి సిద్ధమని ప్రకటన! అమెరికాలో 330.5 బిలియన్ డాలర్ల భారతీయ పెట్టుబడులు: అధికారిక జాబితాను విడుదల చేసిన వైట్‌హౌస్..

నకిలీ పోలీస్ అవతారం ఎత్తి మోసం

Select Suryaa Now
నకిలీ పోలీస్ అవతారం ఎత్తి మోసం

నకిలీ పోలీస్ అవతారం  ఎత్తి మోసం

ఉద్యోగం ఇప్పిస్తామని రూ.7 లక్షలు డిమాండ్....    

   నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు

 యాచారం: పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసిన ఘటనలో సయ్యద్ సమీర్, వినాయక్‌లపై యాచారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితుడు మోరా ఎదు కొండులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి. ఎస్సై సతీష్. లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఫిర్యాదు వివరాల ప్రకారం.. కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించిన నిందితులు తొలుత రూ.2,500 వసూలు చేసి నకిలీ రసీదు ఇచ్చినట్లు బాధితుడు ఆరోపించారు. అనంతరం ఉద్యోగం ఇప్పించేందుకు రూ.7 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఉద్యోగాల పేరుతో మోసపోవద్దు
ఈ ఘటన నేపథ్యంలో యాచారం పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు అడిగే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మధ్యవర్తులను నమ్మి డబ్బులు చెల్లించి మోసపోవద్దని, ఉద్యోగ నియామకాలకు సంబంధించి అధికారిక ప్రకటనలు, సంబంధిత ప్రభుత్వ శాఖల సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని తెలిపారు. ఎవరైనా ఉద్యోగాల పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్‌హెచ్‌ఓ కోరారు. ఈ మేరకు కేసు కట్టి నిండుతులను రీమాండ్ కు తరలించినట్లు తెలిపారు

 కొండ్రు శివ, మేజర్ న్యూస్