కోహీర్ మండలం కొత్తూరు (కె) గ్రామంలో డివిజన్ స్థాయి భూ పునఃసర్వే శిక్షణ
కోహీర్ ; సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని కొత్తూరు (కె) గ్రామంలో డివిజన్ స్థాయి క్షేత్రస్థాయి భూ పునఃసర్వే (ఫీల్డ్ రీ సర్వే) శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. భూముల సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించడం, భూ రికార్డులను సమగ్రంగా పరిశీలించడం, సర్వే ప్రక్రియలో సిబ్బందికి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం ఈ శిక్షణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.భూ పునఃసర్వే ద్వారా భూముల హద్దుల నిర్ధారణలో స్పష్టత తీసుకురావడంతో పాటు, భూ రికార్డుల్లోని వ్యత్యాసాలను గుర్తించి భూ వివాదాల పరిష్కారానికి మార్గం సుగమం చేయవచ్చు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూ సర్వే నిర్వహించడం ద్వారా భూ రికార్డుల్లో పారదర్శకత, ఖచ్చితత్వం పెరిగే అవకాశం ఉంది.ఈ కార్యక్రమంలో శిక్షణలో పాల్గొన్న అధికారులు, సర్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు