గుర్రంపల్లి గ్రామములో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.
— ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ ఈరని జంగయ్య.
జిల్లెడ్ చౌదరిగూడెం: మేజర్ న్యూస్:( అక్టోబర్:18): మండల పరిధిలోని గుర్రంపల్లి గ్రామంలో శుక్రవారం నాడు ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్ జంగయ్య ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డు ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అనంతరం సర్పంచ్ జంగయ్య మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం లో భాగంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడారు. ప్రతి ఇంటికి వెళ్లి రేషన్ కార్డులు మంజూరు చేస్తూ ప్రజలకు అండగా ఉంటామని అలాగే రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని సర్పంచ్ జంగయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ రజని కాంత్, పంచాయతీ కార్యదర్శి యాదయ్య, జే పి ఓ నవీన్ కుమార్, కారోబార్ శ్రీనివాస్ గౌడ్, అంగన్వాడీ టీచర్ పద్మ, వి ఓ ఏ పవిత్ర, ఆశ వర్కర్ జయమ్మ, రాములమ్మ గ్రామ పంచాయతీ సిబ్బంది, రేషన్ కార్డుల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
బండి గోపాల్ మేజర్ న్యూస్