BREAKING
నేటితో ముగినున్న నామినేషన్ల ఘట్టం -రెండో రోజు ఊపందుకున్న నామినేషన్లు -పటిష్ట బందోబస్తు మధ్య కొనసాగిన నామినేషన్ల పర్వం -చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా నామినేషన్లు దుర్గాదేవిగా అమ్మవారు...రేపు మహా అన్నదానం రాయదుర్గం 18వ వార్డు టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ శ్రీరామిరెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బోనమల ఖాదరవల్లి చిగతూర్పి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు దుర్గామాత అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ రష్యాపై ఆంక్షల తాత్కాలిక నిలిపివేత వెనుక ఆంతర్యమిదే: ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని సమీక్షించేందుకే 60 రోజుల గడువు.. స్పష్టం చేసిన మార్కో రూబియో! పట్టణంలోని కీలక వ్యక్తి వైసీపీ వీడి టీడీపీలోకి 18 వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ శ్రీరామ్ రెడ్డి నామినేషన్ రష్యాపై ఆంక్షల మినహాయింపు వివాదం: నా తుది నిర్ణయం ఏమిటో చాలామందికి తెలీదు.. క్లారిటీ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్! కాక్‌పిట్‌లో గొడ్డలితో సహ పైలట్ దాడి.. ‘ఇలా చనిపోకూడదు’ అనుకున్నా.. నిర్మల్ దాండియా నైట్స్‌లో పాల్గొని దాండియా ఆడిన మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్. గ్వాలియర్ రోడ్డు ప్రమాద మృతులకు ప్రధాని మోదీ సంతాపం: ఢిల్లీలో 18.6 డిగ్రీలకు పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రత: చలితీవ్రత పెరుగుతున్న వేళ ప్రస్తుతానికి 'మోడరేట్' స్థాయిలోనే కొనసాగుతున్న వాయు నాణ్యత! ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు.

18 వ వార్డు లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు

Select Suryaa Now
18 వ వార్డు లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు

షాద్‌నగర్ ,మేజర్ న్యూస్…మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు శ్రీనగర్ కాలనీలో కౌన్సిలర్ జామాల్ పూర్ సంతోషి చందూలాల్ ఆధ్వర్యంలో మరియు ఠాగూర్ యూత్ అసోసియేషన్  నిర్వహిస్తున్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం వాారిని   శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐకమత్యం, సోదరభావం, సేవాభావాన్ని పెంపొందిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, కౌన్సిలర్లు, ఫరూక్నగర్ మండల్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నల్లమోని శ్రీధర్ ముదిరాజ్, పట్టణ మాజీ అధ్యక్షులు కొంకాళ్ళ చెన్నయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు విశ్వం,కౌన్సిలర్ సంతోషి చందూలాల్, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ఠాగూర్ యూత్ సభ్యులు, కాలనీ పెద్దలు,మహిళలు భక్తులు తదితరులు  పాల్గొన్నారు.. 

నరసింహారెడ్డి మేజర్ న్యూస్….