దుర్గామాత అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్
సూర్య రుద్రంగి :రుద్రంగి మండల కేంద్రంలో మహాలక్ష్మి మండపం, శ్రీ సువర్ణ సేవాసమితి ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గామాత అమ్మవార్లను ఆదివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి, పశువులు బాగుండి సమృద్ధిగా పంటలు పండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం అమ్మవారి మండపల వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మండపాలు నిర్వాహకులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, సర్పంచ్ గండి నారాయణ, ఉపసర్పంచ్ మాడిశెట్టి అభిలాష్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎర్రం గంగ నర్సయ్య, వార్డు సభ్యులు పూదరి మహిపాల్, ఎర్రం అరవింద్, అంబటి శ్రీనివాస్ నాయకులు తర్రె మనోహర్, ధర్నా మల్లేశం, సనుగుల గంగాధర్, తుం జలపతి, గట్ల మీనయ్య, కొమిరె శంకర్, చెలకల శ్రీకాంత్, ఆకుల గగన్, గంధం మనోజ్, వెంకటేశం తో పాటు తదితరులు పాల్గొన్నారు.