ఘనంగా మహిళా కార్మికుల బతుకమ్మ వేడుక
హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ :మహిళా కార్మికుల ఆధ్వర్యంలో హిమాయత్నగర్లోనీ ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం వద్ద బతుకమ్మ వేడుకలు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. వివిధ రంగాలకు చెందిన శ్రామిక మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉల్లాసంగా బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎం. నరసింహ మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ప్రకృతితో పాటు శ్రమజీవుల జీవన విధానంతో ముడిపడి ఉన్న విశిష్టమైన ఉత్సవమని కొనియాడారు. బతుకమ్మ పండుగ మహిళల ఆత్మగౌరవానికి, ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.కార్మిక మహిళల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి ఏఐటీయూసీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎం. నరసింహ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి ప్రేమ్ పావని, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి హసీనా బేగం, కమతం యాదగిరి,ఎం ఎస్ మూర్తి, రాష్ట్రనాయకులు ఎం లక్ష్మీబాయి, ఏ పార్వతి, జె లక్ష్మి, బురనా, కరుణ కుమారి,కృష్ణవేణి, చంద్రమ్మ, కార్మిక సంఘాల ప్రతినిధులు , పెద్ద సంఖ్యలో మహిళా కార్మికులు పాల్గొన్నారు.