గ్రామంలో వ్యాయామ గ్రౌండ్ కరువు.. రోడ్డుపైనే యువతకు వ్యాయామం!*
*సూర్య శాలిగౌరారం....!!*
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం పరిధిలో యువతకు క్రీడా మైదానం కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం?
గ్రామాల్లో యువత శారీరక దృఢత్వం కోసం వ్యాయామం చేయాలన్నా, రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలన్నా సరైన మైదానం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపైనే వ్యాయామం చేయాల్సి వస్తోంది. రోడ్లపై వాహనాల రాకపోకల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో యువత ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది.
ముఖ్యంగా గ్రామంలో మంచి గ్రౌండ్ ఉండటంవల్ల యువత యువత క్రీడల్లో పాల్గొని మద్యపానం డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు అలవాటు కాకుండా ఉంటుంది
ఇప్పటికైనా సంబంధిత అధికారులు, గ్రామపంచాయతీ పాలకవర్గం స్పందించి యువతకు సురక్షితమైన వ్యాయామ మైదానాన్ని ఏర్పాటు చేయాలి. రోడ్లపై వ్యాయామం చేసే పరిస్థితికి స్వస్తి పలకాలని గ్రామ ప్రజలు, యువత కోరుతున్నారు.