BREAKING
సరిహద్దుల్లో యుద్ద విమానాలను రంగంలోకి దించిన పోలాండ్ వారం రోజుల్లో 76 సార్లు దాడులు జరిగాయని జెలెన్‌స్కీ వెల్లడి ఇరాన్ నూతన రక్షణ మంత్రిగా మెహర్దాద్ అఖ్లాఖి హత్నూర ప్రధాన రహదారిపై రాస్తారోకో ధర్నా 2029 లో వైఎస్ జగన్ అంబటి మురళీకృష్ణ ఘన విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు చేసిన ....... షేక్ ఇమ్రాన్ కాక్‌పిట్‌ ఘోరాన్ని వివరించిన భారత పైలట్ స్మిత్ మచ్చార్ క్యాన్సర్ బాధితులకు కేంద్రం తీపి కబురు రుద్రారంలో ఘనంగా దుర్గా హోమం మహిళల ఆరోగ్యానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత దేశ నిర్మాణంలో యువతే కీలకం...కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య వెల్లడి 'మై భారత్' - ఎన్ఎస్ఎస్ ప్రచారం నవాంద్గి రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి జీవవైవిధ్య పరిరక్షణకు రూ. 1.19 కోట్ల నిధులు విడుదల నేరేడ్‌మెట్ పరిధిలో ఘనంగా దేవీ నవరాత్రులు: కాలనీల మండపాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత ఉపేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు! వినాయక్ నగర్, నేరేడ్‌మెట్‌లో వైభవంగా దేవీ శరన్నవరాత్రులు: పూజల్లో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు!

ప్రధాన రహదారిపై నిలిపివేస్తున్న వాహనాలు..

Select Suryaa Now
ప్రధాన రహదారిపై నిలిపివేస్తున్న వాహనాలు..

సూర్య బెజ్జుర్ :కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై అడ్డదిడ్డంగా వాహనాలను నిలిపివేయడం వల్ల స్థానిక ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లు, ఇరుకైన రోడ్లపై, ముఖ్యంగా వారంతపు సంత, రోజుల్లో వ్యాపార సముదాయాల ముందు, నడిరోడ్డుపైనే లారీలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను నిలపడం వల్ల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతున్నాయి. ఎదుర్కొంటున్న ప్రధాన
ఇరుకైన రహదారిపై ఇష్టారాజ్యంగా వాహనాలు పార్క్ చేయడం వల్ల ఆర్టీసీ బస్సులు, అత్యవసర అంబులెన్స్ వాహనాలు కూడా ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడుతోంది.ప్రధాన రహదారి పక్కన భారీ వాహనాలను నిలపడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక తరచూ చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి.రోడ్డు మార్జిన్లు మొత్తం పార్కింగ్ వాహనాలతో నిండిపోవడంతో ప్రజలు రోడ్డు మధ్యలో నుంచే నడవాల్సి వస్తోంది.

- పరిష్కారానికి చర్యలు:ఈ సమస్యపై స్థానిక పోలీసులు, అధికారులు స్పందించి రోడ్డుపై అక్రమంగా వాహనాలు నిలిపే వారిపై ట్రాఫిక్ చలాన్లు (నో పార్కింగ్ కేసులు) నమోదు చేయాలని, ప్రధాన ప్రాంతాల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.