మైసమ్మ సన్నిధిలో భక్తుల సందడి
నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని కాకర్లపహాడ్ సమీపంలో ఉన్న శ్రీశ్రీశ్రీ పర్వతాపూర్ మైసమ్మ అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతుండటం,ఆదివారం సెలవు దినం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.దీంతో ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో కళకళలాడింది.