BREAKING
పార్వతీపురంలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం.. నామినేషన్ల పర్వానికి కూటమి శ్రీకారం!పురపాలక చైర్‌పర్సన్ అభ్యర్థిగా బెలగం కరుణ నామినేషన్ దాఖలు.. 36 వార్డుల అభ్యర్థుల నామినేషన్లు సీతానగరం మండలం జడ్పీటీసీ వైసిపి అభ్యర్థిగా అల్లు విజయ పేరును ఖరారు చేసిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మోకాళ్లపై కూర్చొని జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల నిరసన -నాగర్‌కర్నూల్‌లో ఆరో రోజుకు చేరిన నిరవధిక సమ్మె.. గద్దె మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సమాజంలోని చెడును పారద్రోలి, ప్రజలకు రక్షణ కల్పిస్తున్నాం -జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా వైరస్ మల్కాజిగిరిలో ఘనంగా దేవీ నవరాత్రులు: కాలనీల మండపాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జీఎన్‌వీ సతీష్ కుమార్ ప్రత్యేక పూజలు! సరిహద్దుల్లో యుద్ద విమానాలను రంగంలోకి దించిన పోలాండ్ వారం రోజుల్లో 76 సార్లు దాడులు జరిగాయని జెలెన్‌స్కీ వెల్లడి ఇరాన్ నూతన రక్షణ మంత్రిగా మెహర్దాద్ అఖ్లాఖి హత్నూర ప్రధాన రహదారిపై రాస్తారోకో ధర్నా 2029 లో వైఎస్ జగన్ అంబటి మురళీకృష్ణ ఘన విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు చేసిన ....... షేక్ ఇమ్రాన్ కాక్‌పిట్‌ ఘోరాన్ని వివరించిన భారత పైలట్ స్మిత్ మచ్చార్ క్యాన్సర్ బాధితులకు కేంద్రం తీపి కబురు రుద్రారంలో ఘనంగా దుర్గా హోమం

అమ్మవారి ఆశీస్సులతో అందరూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి దేవీ మండపాలను దర్శించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

Select Suryaa Now
అమ్మవారి ఆశీస్సులతో అందరూ ప్రజలందరూ  సంతోషంగా ఉండాలి దేవీ మండపాలను దర్శించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజిగిరి, మేజర్ న్యూస్:.అమ్మవారి కృపాకటాక్షాలతో  నియోజకవర్గం ప్రజలం దరూ సుఖసంతోషాలతో ఉండాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు. దసరా పురస్కరించుకుని శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా  మల్కాజిగిరి నియోజకవర్గంలోని మౌలాలి,
వినాయక్ నగర్, నేరేడ్‌మెట్ డివిజన్‌ లలోని  ఏర్పాటు చేసిన 15 దేవీ మండపాలను ఎమ్మెల్యే సందర్శించి అమ్మవారి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, అమ్మ వారి దీవెనలతో ప్రజలందరూ ఆయురారో గ్యాలు, అష్టైశ్వర్యాలతో ఇంటిల్లిపాదితో ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడంతో పాటు సమా జంలో ఐక్యత, సోదరభావం, సామరస్యాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్  నేతలు బద్దం పరుశురాం రెడ్డి, జీకే హనుమంతరావు, జేఏసీ వెంకన్న, గ్రేటర్ మాజీ కార్యదర్శి  అమీ నుద్దీన్, సీనియర్ నేత భాగ్యనంద్ రావు, జోగు శ్రీనివాస్, బుద్ది నర్సింగ్ రావు, మహేష్ గౌడ్,  నవాబ్, తదితరులు  పాల్గొన్నారు.