శివకుమార్ కుటుంబానికి అండగా ఉంటా : పట్నం అవినాష్ రెడ్డి
షాబాద్ : మండల పరిధిలోని మన్మర్రి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు ఎర్రవల్లి శివకుమార్ (రాజు) అనారోగ్యంతో మృతి చెందడంతో మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి ఆదివారం మన్మర్రి గ్రామానికి వెళ్లి ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి మాట్లాడుతూ... పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేసిన శివకుమార్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నర్సింలు గౌడ్, మాజీ ఎంపిటిసి మధుకర్ రెడ్డి, చెన్నయ్య, గ్రామస్తుడు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
షాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 18