BREAKING
సరిహద్దుల్లో యుద్ద విమానాలను రంగంలోకి దించిన పోలాండ్ వారం రోజుల్లో 76 సార్లు దాడులు జరిగాయని జెలెన్‌స్కీ వెల్లడి ఇరాన్ నూతన రక్షణ మంత్రిగా మెహర్దాద్ అఖ్లాఖి హత్నూర ప్రధాన రహదారిపై రాస్తారోకో ధర్నా 2029 లో వైఎస్ జగన్ అంబటి మురళీకృష్ణ ఘన విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు చేసిన ....... షేక్ ఇమ్రాన్ కాక్‌పిట్‌ ఘోరాన్ని వివరించిన భారత పైలట్ స్మిత్ మచ్చార్ క్యాన్సర్ బాధితులకు కేంద్రం తీపి కబురు రుద్రారంలో ఘనంగా దుర్గా హోమం మహిళల ఆరోగ్యానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత దేశ నిర్మాణంలో యువతే కీలకం...కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య వెల్లడి 'మై భారత్' - ఎన్ఎస్ఎస్ ప్రచారం నవాంద్గి రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి జీవవైవిధ్య పరిరక్షణకు రూ. 1.19 కోట్ల నిధులు విడుదల నేరేడ్‌మెట్ పరిధిలో ఘనంగా దేవీ నవరాత్రులు: కాలనీల మండపాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత ఉపేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు! వినాయక్ నగర్, నేరేడ్‌మెట్‌లో వైభవంగా దేవీ శరన్నవరాత్రులు: పూజల్లో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు!

సూర్యోదయ కాలనీలో... 15 రోజులుగా తాగునీటి కష్టాలు!

Select Suryaa Now
సూర్యోదయ కాలనీలో... 15 రోజులుగా తాగునీటి కష్టాలు!

భూగర్భ డ్రైనేజీ పనులతో పగిలిన పైపులైన్లు.. అధికారుల మధ్య సమన్వయ లోపం

గండిపేట్ : రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బండ్లగూడ డివిజన్‌ సూర్యోదయ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. భూగర్భ డ్రైనేజీ పనుల్లో మంచినీటి పైపులైన్లు దెబ్బతినడంతో రోడ్డు నంబర్లు 1, 3తో పాటు పరిసర ప్రాంతాల్లో 15 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమస్యను జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని, ఒక శాఖ పరిధిలోకి రాదని మరో శాఖ బాధ్యత తప్పించుకుంటోందని వారు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు సమన్వయంతో దెబ్బతిన్న నాలుగు అంగుళాల పైపులైన్లతో పాటు ప్రధాన పైపులైన్లకు మరమ్మతులు చేపట్టి తక్షణమే నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ కిస్మత్‌పూర్ సెక్షన్ కార్యాలయం ఎదుట నిరసన చేపడతామని హెచ్చరించారు.

 

గండిపేట్ మేజర్ న్యూస్: (అక్టోబర్ 18)