నామినేషన్ దాఖలు చేసిన టిడిపి అభ్యర్థి యేరిచర్ల హానీ
నామినేషన్ దాఖలు చేసిన టిడిపి అభ్యర్థి యేరిచర్ల హానీ
బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద నామినేషన్ల సందడి నెలకొంది. టీడీపీ చైర్ పర్సన్ అభ్యర్థిగా యేరిచర్ల హనీ నామినేషన్ దాఖలు చేయగా, పలువురు కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్యతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో కార్యాలయం వద్ద సందడి నెలకొనగా, పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.