టిడిపి చైర్మన్ అభ్యర్థిగా మాచాని సునీత నామినేషన్
టిడిపి చైర్మన్ అభ్యర్థిగా మాచాని సునీత నామినేషన్
ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి..ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ప్రకటించిన మాచాని సునీత తన నామినేషన్ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయ నాగేశ్వర రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. అనంతరం ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీ శ్రేణుల నినాదాల మధ్య మాచాని సునీత నామినేషన్ దాఖలు కార్యక్రమం కొనసాగింది. ఎమ్మిగనూరు మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం ఆమె పేరును ఖరారు చేయడంతో టీడీపీ శ్రేణుల్లో రాజకీయ సందడి నెలకొంది.
ఎమ్మెల్యే బీవీ. జయ నాగేశ్వర రెడ్డితో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని మాచాని సునీతకు మద్దతు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మిగనూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మాచాని సునీత నామినేషన్ దాఖలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
జిలాని భాష ఎమ్మిగనూరు టౌన్ సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా