BREAKING
‘నువ్వు జోక్ చేస్తున్నావు కదా?’: వాల్ స్ట్రీట్ హై-పేయింగ్ జాబ్ వదిలేసి.. కార్లలో తిరుగుతూ అమెరికా టూర్‌కు వెళ్లిన యువతి! జర్మనీ విమానాశ్రయంలో రక్షణ కంచెను ఢీకొట్టిన వాహనం, పోలీసుల విస్తృత తనిఖీలు శివకుమార్ కుటుంబానికి అండగా ఉంటా : పట్నం అవినాష్ రెడ్డి దసరా నవరాత్రుల వేళ రేవంత్‌గా మెప్పించిన నటులు.. వెండితెర లంకేశ్వరులు వీరే! రణబాలి సినిమాపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు.. హాలీవుడ్ క్లాసిక్ సినిమాలతో పోలిక! సూర్యోదయ కాలనీలో... 15 రోజులుగా తాగునీటి కష్టాలు! ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి తో దస్తగీర్ స్టాక్ మార్కెట్లకు కీలక వారం: Q2 ఫలితాలు, క్రూడాయిల్, జియో ఐపీఓపైనే దృష్టి! అనిరుధ్ రవిచందర్ కాబోయే భార్య గురించి పదేళ్ల క్రితమే జోస్యం చెప్పిన ట్యాట్ కార్డ్ రీడర్.. వీడియో వైరల్! వాసవీమాత సన్నిధిలో మాజీ మంత్రి డీఎల్ ప్రత్యేక పూజలు డీఎల్ రవీంద్రారెడ్డికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం శాలువాతో సత్కరించిన ఆర్యవైశ్య సభ ప్రతినిధులు మాజీ ఎమ్మెల్యే వైవీఆర్‌ను అడ్డుకున్న పోలీసులు గుత్తి మండలం రజాపురం వద్ద ఉద్రిక్తత.. పోలీసులతో వాగ్వాదం ఎన్నికల నియమావళి నేపథ్యంలో అనుమతి లేదంటూ అడ్డగింత.. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నారని వైవీఆర్ ఆగ్రహం ఎఫ్‌ఎంసీజీ రంగానికి ముడిసరుకుల ధరల సెగ ! మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థిగా నాగరాజు నామినేషన్ దాఖలు. పరిగి ఎమ్మెల్యే నివాసంలో నేడు బతుకమ్మ సంబరాలు ప్రధాన రహదారిపై నిలిపివేస్తున్న వాహనాలు..

మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పోచారం

Select Suryaa Now
మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పోచారం

సూర్య బాన్సువాడ: బాన్సువాడ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు యండమూరి వరప్రసాద్ (58) శనివారం మృతి చెందిన విషయం విదితమే. గత కొన్ని రోజులుగా అయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఆయన పార్థివ దేహాన్ని బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి సందర్శించి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ, జర్నలిస్టు వరప్రసాద్ బాన్సువాడ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా వివిధ సమస్యలపై వార్తలు రాస్తూ ప్రజల పక్షాన నిలిచారని కొనియాడారు. సాక్షి, ఆంధ్రజ్యోతి, సూర్య పత్రికల్లో పనిచేసి తనదైన ముద్ర వేశారని అన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రసాద్ మృతి బాన్సువాడ జర్నలిజానికి తీరని లోటని, ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.. కుటుంబానికి ఆర్థిక సహాయం పింఛన్, ఉద్యోగం హామీ
మృతుని కుటుంబానికి సహాయం అందించేందుకు ఎమ్మెల్యే పోచారం వెంటనే మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ప్రసాద్ కుటుంబానికి ఆర్థికంగా చేయూత ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఐదేళ్ల పాటు నెలకు రూ.3 వేల చొప్పున పింఛన్, అలాగే జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.అంతేకాకుండా ఎమ్మెల్యే పోచారం స్వయంగా ప్రసాద్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. వారి కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు... పలువురు నేతలు, జర్నలిస్టులు నివాళి
వరప్రసాద్ పార్థివ దేహాన్ని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షులు రజనీకాంత్, కార్యదర్శి తోట రాజేష్ సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబానికి అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్ నేత అంజిరెడ్డి, కాంగ్రెస్ నేత గురువినయ్ కుమార్, బస్వారాజ్ తదితరులు పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వివిధ పార్టీల నాయకులు, అధికారులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులు అర్పించారు. వరప్రసాద్ మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని అందరూ ప్రార్థించారు.