నేటితో ముగినున్న నామినేషన్ల ఘట్టం -రెండో రోజు ఊపందుకున్న నామినేషన్లు -పటిష్ట బందోబస్తు మధ్య కొనసాగిన నామినేషన్ల పర్వం -చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా నామినేషన్లు
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల్లో భాగంగా శనివారం రెండో రోజు నామినేషన్ల ఘట్టం చెదురు ముదురు సంఘటనల మధ్య ప్రశాంతంగా ముగిసింది. సంజయ్ కాంతి కాలనీలోని 55, 56, 57, డివిజన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన నామినేషన్ కార్యాలయంలో పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే నవోదయ కాలనీలోని ఏర్పాటుచేసిన నామినేషన్ల కార్యాలయంలో 58, 59, 60 డివిజన్లకు సంబంధించిన పలు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, ఇండిపెండెంట్, హాజరై నామినేషన్లు దాఖలు చేశారు. జీవకోన సత్యనారాయణపురంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కార్యాలయాలలోను నామినేషన్ల పర్వం ఊపందుకుంది.
నేటితో ముగినున్న నామినేషన్ల ఘట్టం
నగరపాలక సంస్థ ఎన్నికలలో భాగంగా శుక్రవారం నుంచి ప్రారంభమైన మేయర్, కార్పొరేటర్ల ఎన్నికలలో భాగంగా నామినేషన్ల గడువు ఆదివారం మూడు గంటలకు ముగియనుంది. ఇప్పటివరకు నామినేషన్ దాఖలు చేయని అభ్యర్థులు, పలు పార్టీల బీఫాములతో ఆదివారం పెద్ద సంఖ్యలో నామినేషన్లో దాఖలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో చివరరోజు నామినేషన్ల ప్రక్రియకు పోలీసు సిబ్బంది, అధికారులు పటిష్ట బందోబస్తుతో పాటు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.
కూటమి నేతలు నామినేషన్లు దాఖలు
మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ ఎన్నికలలో భాగంగా శనివారం రెండో రోజు పలు డివిజన్లకు సంబంధించిన కూటమి తరపున కార్పొరేటర్ అభ్యర్థులు వేరువేరుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో భాగంగా 57వ డివిజన్ కు గాలి కావ్య, 56 డివిజన్ కు ఏ జాహ్నవి, 56వ డివిజన్ కు పెమ్మసాని ఎతిషా, 58వ డివిజన్ కు జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి ఆకేపాటీ సుభాషిణితో నామినేషన్లు దాఖలు చేశారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్