ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
సూర్య ఖమ్మం,తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో భాగంగా సద్దుల బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
సద్దుల బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా సంతోషాలు నింపాలని, కుటుంబాలన్నీ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని పువ్వాడ అజయ్ కుమార్ ఆకాంక్షించారు.
*ఉమ్మడి ఖమ్మం ,సూర్య బ్యూరో చీఫ్ పసుపులేటి సత్యనారాయణ*