పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే
నారాయణఖేడ్ నియోజకవర్గం మండల పరిధిలోని ర్యాలమడుగు గ్రామ శివారులో గల మాణిక్ నాయక్ తండాకు చెందిన లలిత, భర్త రాజు దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకల్లో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతన గృహంలోకి అడుగుపెట్టిన లలిత, రాజు దంపతులకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేసి, వారి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ, ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నిజం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన పేదలకు సొంత ఇల్లు కల్పించాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. సొంత ఇంటి కల నెరవేరడంతో పేద కుటుంబాలకు భరోసా, భద్రత లభిస్తుందని అన్నారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పండరి రెడ్డి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,సర్పంచ్ భీమ్ నాయక్,స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సంతోష్ నిజాంపేట్ మండల సూర్య రిపోర్టర్…