రోడ్డు విస్తరణ పనుల పర్యవేక్షణ
*రోడ్డు విస్తరణ పనులు పర్యవేక్షణ*
ఆత్మకూరు/ సూర్య న్యూస్: ఆత్మకూరు పట్టణంలో అమరచింత రోడ్డు నందు విస్తరణ పనులను శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యవేక్షించారు. రాష్ట్ర మంత్రి వాకటి శ్రీహరి ఆదేశానుసారం పనులను పరిశీలించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నల్గొండ శ్రీనివాసులు, కౌన్సిలర్ తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సద్దల తులసి వెంకట రాములు, హజమతుల్లా ,కోఆప్షన్ సభ్యులు జహంగీర్, తదితరులు పాల్గొన్నారు.