BREAKING
కనకదుర్గమ్మ దర్శించుకున్న హైకోర్టు జడ్జి లక్ష్మణరావు అమెరికా ఎన్నికల్లో అక్రమంగా ఓటు వేసిన భారత సంతతి వ్యక్తి అరెస్ట్: కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఫెడరల్ అధికారులు రాపిడ్‌కాన్వాస్ ఖాతాలో 29 మిలియన్ డాలర్ల నిధులు: వెర్టెక్స్ వెంచర్స్ నేతృత్వంలో సిరీస్-బి రౌండ్ పూర్తి.. 52.5 మిలియన్ డాలర్లకు చేరిన మొత్తం సమీకరణ! ఎఫ్‌ఎస్‌ఐబీని పునర్వ్యవస్థీకరించిన కేంద్ర ప్రభుత్వం: నూతన ఛైర్మన్‌గా మాజీ ఎంఎస్ఎంఈ కార్యదర్శి ఎస్‌సీఎల్ దాస్ నియామకం! చైనాలో మాస్టర్‌కార్డ్, సిటీగ్రూప్‌లకు మార్కెట్ అనుమతులపై అమెరికా ఒత్తిడి: బ్యాంకాక్ ద్వైపాక్షిక భేటీల్లో కీలక అంశం 100 డాలర్ల మార్కును దాటిన అమెరికా క్రూడాయిల్: హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడుల తీవ్రత.. ఈ వారంలో డబ్ల్యూటీఐ 9 శాతం జంప్! నకిలీ పోలీస్ అవతారం ఎత్తి మోసం నిర్మలా సీతారామన్ వాణిజ్య అడ్డంకుల ప్రస్తావనపై స్పందించిన చైనా: పరస్పర ఆర్థిక ఆందోళనల పరిష్కారానికి సిద్ధమని ప్రకటన! అమెరికాలో 330.5 బిలియన్ డాలర్ల భారతీయ పెట్టుబడులు: అధికారిక జాబితాను విడుదల చేసిన వైట్‌హౌస్.. ప్రపంచానికి 800 మిలియన్ల ఉద్యోగాల లోటు: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా హెచ్చరిక.. ఉపాధి సంక్షోభ పరిష్కారానికి సమగ్ర బ్లూప్రింట్ దేశంలోనే అతిపెద్ద ఐపీవో: జియో ప్లాట్‌ఫామ్స్ ప్రైస్ బ్యాండ్ రూ. 1,065–1,119గా ఖరారు.అక్టోబర్ 21న ప్రారంభం కానున్న మెగా పబ్లిక్ ఇష్యూ ఐసీఐసీఐ లాంబార్డ్ క్యూ2 ఫలితాలు: నికర లాభంలో 15 శాతం వృద్ధి.. ఒక్కో షేరుకు 7 రూపాయల డివిడెండ్ ప్రకటన! ఇజ్రాయెల్ నిబంధనలకు ఎయిర్ ఫ్రాన్స్ మొగ్గు.. ద్రవ్యోల్బణానికి రక్షణగా నిలవని బంగారం: వారం రోజుల కనిష్టానికి పడిపోయిన స్పాట్ గోల్డ్.. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు భయాలతో అమ్మకాల ఒత్తిడి పూల పండుగతో పులకించిన మందమర్రి కోర్టు ప్రాంగణం

మహాలక్ష్మీదేవిగా కనకదుర్గమ్మ దివ్యదర్శనం

Select Suryaa Now
మహాలక్ష్మీదేవిగా కనకదుర్గమ్మ దివ్యదర్శనం

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏడో రోజైన శనివారం ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. “జై దుర్గా భవానీ.. జై జై మహాలక్ష్మీ” అంటూ భక్తుల నామస్మరణతో కొండ మార్మోగుతోంది. సిరిసంపదలు, సౌభాగ్యం, సుఖసంతోషాలు ప్రసాదించే జగన్మాతను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మహాలక్ష్మీ స్వరూపంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. తమ కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని, రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని, వ్యాపారాలు అభివృద్ధి చెందాలని, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని జగన్మాతను ప్రార్థిస్తున్నారు. ఐశ్వర్యం, ధాన్యసంపద, సౌభాగ్యం, ఆరోగ్యం, ధైర్యం, జ్ఞానం, కుటుంబ సౌఖ్యాలను ప్రసాదించే తల్లిగా మహాలక్ష్మీదేవిని భక్తులు ఆరాధిస్తున్నారు. అమ్మవారి కరుణాకటాక్షాలు తమ కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా వేడుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తుతోంది.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.