ఏపీలో ద్రోణి ప్రభావం.. పలు జిల్లాల్లో వర్షాలు
దక్షిణ కోస్తా నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణం మారిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలతో పాటు మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.