BREAKING
ఐర్లాండ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె తాత్కాలికంగా వాయిదా కెనడాలో ఫస్ట్ డేటా సెంటర్ లీజ్ ఒప్పందం కుదుర్చుకున్న ఆంత్రోపిక్ అమెరికా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు 2.8 శాతం జీతం పెంపు అమెరికా ఎన్నికల్లో టెన్నెస్సీ నియోజకవర్గాల రీడ్రాయింగ్ కలకలం రష్యాపై అదనపు ఆంక్షలు, సుంకాలను మినహాయిస్తూ ట్రంప్ కీలక నిర్ణయం బంగ్లాదేశ్‌లో మిజిల్స్ ముప్పు...ప్రపంచ దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు అమ్మవారి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలి  మద్యం తాగి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదు! శరన్నవరాత్రుల 7వ రోజు.. శ్రీ మహా చండీ అమ్మవారి అలంకరణలో బ్రహ్మగిరి క్షేత్రం సిద్దిపేటలో ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆరోపణలు! కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పై వైఎస్ఆర్సిపి పార్టీ జెండా ఖాయం. హిమగిరి నగర్‌లో మంచినీటి వృథా..! అచ్చిరాని రావులపాలెం ఎంపీపీ ఘనంగా శరన్న నవరాత్రి ఉత్సవాలు శాంతిభద్రతలు కాపాడేందుకు ఎస్సీ కాలనీలో పల్లెనిద్ర. ఎస్ఐ లోకేష్ కుమార్.

అచ్చిరాని రావులపాలెం ఎంపీపీ

Select Suryaa Now
అచ్చిరాని రావులపాలెం ఎంపీపీ

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంరావులపాలెం పేరు చెబితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఉండరు. వ్యాపార వాణిజ్య పరంగానేకాదు,రాజకీయ పరంగా  ఎంతో గుర్తింపు పొందింది.  ఎన్నో ఉద్యమాలకు కూడా కేంద్ర బిందువుగా పేరు గాంచింది.  అయితే మండల వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి ఈ మండలం కలిసిరాని మండలం గా ముద్ర పడిపోయింది. రావులపాలెం ఎంపీపీ పదవి అంటే అమ్మ బాబోయ్ అన్న పరిస్థితి ఏర్పడింది. మండల వ్యవస్థ మొట్టమొదటి నుంచి ఎంపీపీ పదవి ఎవర్ని వరించినా.. రాజకీయంగాను ఆర్థికంగానూ కలిసి రాకపోవడంతో రావులపాలెం ఎంపీపీ పదం అంటే రాజకీయ నేతలు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి.

 మొట్టమొదటి ఎంపిపి పదవి చేబట్టిన  టి.వి. సత్యనారాయణ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ రాజకీయంగా ఎదగలేకపోయారు.

చిన్నం సుబ్బిరెడ్డి, ఏనుగుపల్లి గంగాధర్, కోట చెల్లయ్య, కర్రి లక్ష్మీవీరరెడ్డి ఇలా  వీరంతా రావులపాలెం ఎంపీపీగా పనిచేసి ఆర్దికంగా దెబ్బతినడమే కాదు, రాజకీయంగా కనుమరుగైపోయారు. అంతేకాదు  మండల పరిషత్ అధ్యక్షురాలుగా పనిచేసిన  కొవ్వూరు సత్యప్రభ రాజకీయంగా ఎంతో ఎత్తు ఎదిగే అవకాశం వచ్చినా ఆమెకూ కలిసిరాలేదు. ఆమె భర్త కె వి సత్యనారాయణ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండేవారు. 2014 ఎన్నికల్లో  కొత్తపేట కాంగ్రెస్ అభ్యర్థిగా స్వయంగా రాజశేఖర్ రెడ్డి ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలో చేజారి ఆటికెట్టు కాస్తా చిర్ల జగ్గిరెడ్డి తన్నుకు పోయారు.   అదేంటో తెలియదు కానీ రావులపాలెం ఎంపీపీగా పనిచేసిన ఏ ఒక్కరూ రాజకీయంగా ఎదగలేకపోయినప్పటికీ, ఆర్థికంగా కూడా నష్టపోయారని  ప్రజల్లో  ముద్ర పడిపోయింది.

దాంతో రావులపాలెం మండల పరిషత్ అధ్యక్షత పదవి ఇప్పుడు రాజకీయ నేతల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోంది.

ఈ సెంటిమెంట్కు భయపడి అందరూ ఎంపీపీ పదవి అంటే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారైనా ఆసెంటిమెంట్ ను చెరిపేస్తారా....?

మరి రేపు జరుగుతున్న ఎన్నికల్లో  ఎవరు వస్తారో వేసి చూడాలి.