హిమగిరి నగర్లో మంచినీటి వృథా..!
hmwssb అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం!
ఓవైపు నీటి సరఫరా కరువు.. మరోవైపు రోడ్లపై ఏరులై పారుతున్న తాగునీరు
గండిపేట్ : రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్షాకోట్ డివిజన్ హిమగిరి నగర్ కాలనీలో గత కొన్ని రోజులుగా మంచినీరు లీకై రోడ్లపై వృథాగా పారుతున్నా hmwssb కిస్మత్పూర్ సెక్షన్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో నెలల తరబడి నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు తాగునీరు వృథా కావడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.
ఒకవైపు నీటిని పొదుపుగా వినియోగించాలని ప్రభుత్వం హెచ్చరిస్తుంటే, మరోవైపు లీకేజీలను అరికట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం విమర్శలకు తావిస్తోంది. వెంటనే లీకేజీని అరికట్టి, బాధ్యులైన అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.
గండిపేట్, మేజర్ న్యూస్: (అక్టోబర్ 17)