BREAKING
విదేశీ టూరిస్ట్‌ల హత్య కేసులో మెక్సికో కోర్టు తీర్పు...ముగ్గురు దోషులకు 158 ఏళ్ల జైలు శిక్ష బ్రెజిల్ అధ్య‌క్ష పోరు...అప్పుల నియంత్ర్రణకు ఫ్లేవియో బోల్సోనారో ప్రణాళిక నిజాయితీగూడెంలో నేత్రపర్వంగా శ్రీ దుర్గామాత కుంకుమ పూజలు బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్ల పనులను పర్యవేక్షించిన మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ కౌన్సిలర్లు రోడ్డు విస్తరణ పనుల పర్యవేక్షణ బంగారం ప్రియులకు భారీ ఊరట.. భారీగా పడిపోయిన గోల్డ్, సిల్వర్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాల్టి రేట్లు ఇవే! ఇంద్రకీలాద్రిపై శ్రీమహాలక్ష్మి అవతారంలో దుర్గమ్మ మార్షల్ ఆర్ట్స్ లో దుద్దెడ యువకుడికి బ్లాక్ బెల్ట్ ఏపీలో ద్రోణి ప్రభావం.. పలు జిల్లాల్లో వర్షాలు పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు మెయిల్ ఇన్‌ బ్యాలెట్లపై కాలిఫోర్నియా అధికారులకు ట్రంప్ హెచ్చరిక సెక్యూరిటీ దిగ్గజం అలైడ్ యూనివర్సల్‌పై సాఫ్ట్‌బ్యాంక్ కన్ను కాక్రోచ్ జన్‌తా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే అరెస్ట్ కెన్వ్యూ దాఖలు చేసిన రిహీరింగ్ పిటిషన్‌ను తోసిపుచ్చిన అమెరికా అప్పీల్స్ కోర్టు

అమ్మవారి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలి 

Select Suryaa Now
అమ్మవారి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలి 

కొల్చారం …దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ చల్లగుండాలని బి ఆర్ ఎస్ యువత విభాగం అధ్యక్షుడు తణుకులపల్లి సంతోష్ రావు కోరారు. దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సంతోష్ రావు శుక్రవారం సాయంత్రం కొల్చారం, వెంకటాపూర్ గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా  కొల్చారంలోని శివాలయం, వీరభద్ర ఆలయం, వెంకటాపూర్ గ్రామంలో ఏర్పాటుచేసిన దేవి మంటపాలలో సరస్వతి దేవి రూపంలో ఉన్న అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. సంతోష్ రావు తన వంతు కానుకగా అమ్మవారి మంటపాలకు నగదు సహాయం అందజేశారు.  అనంతరం పలువురు నాయకులు సంతోష్ రావును శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాణి గోపి, మాజీ ఉపసర్పంచులు చెన్నయ్య, చిన్న రాములు, కృష్ణ,  వార్డు మెంబర్లు సత్యనారాయణ, లక్ష్మి కిష్టయ్య, షేకులు, వనమాల రాణి శ్రీధర్, జూలకంటి సంగమేశ్వర్, నాయకులు పాండ్ర వెంకటేశం, ఆకుల సిద్ధి రాములు, భాస్కర్,  ఆంజనేయులు, అశోక్, ధనరాజ్, ఆరే రవీందర్, సురేష్,  యువకులు పాల్గొన్నారు.