శరన్నవరాత్రుల 7వ రోజు.. శ్రీ మహా చండీ అమ్మవారి అలంకరణలో బ్రహ్మగిరి క్షేత్రం
చేవెళ్ల: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు చేవెళ్లలోని బ్రహ్మగిరి క్షేత్రంలో శ్రీ మహా చండీ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఏడవ రోజు శ్రీ మహా చండీ అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అమ్మవారి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని, సకల శుభాలు కలగాలని భక్తులు ప్రార్థిస్తున్నారు.
శరన్నవరాత్రి ఉత్సవాలతో బ్రహ్మగిరి క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
( చేవెళ్ల - మేజర్ న్యూస్)