BREAKING
హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు సిద్ధం: ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ స్పష్టత! కనకదుర్గమ్మ దర్శించుకున్న హైకోర్టు జడ్జి లక్ష్మణరావు అమెరికా ఎన్నికల్లో అక్రమంగా ఓటు వేసిన భారత సంతతి వ్యక్తి అరెస్ట్: కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఫెడరల్ అధికారులు రాపిడ్‌కాన్వాస్ ఖాతాలో 29 మిలియన్ డాలర్ల నిధులు: వెర్టెక్స్ వెంచర్స్ నేతృత్వంలో సిరీస్-బి రౌండ్ పూర్తి.. 52.5 మిలియన్ డాలర్లకు చేరిన మొత్తం సమీకరణ! ఎఫ్‌ఎస్‌ఐబీని పునర్వ్యవస్థీకరించిన కేంద్ర ప్రభుత్వం: నూతన ఛైర్మన్‌గా మాజీ ఎంఎస్ఎంఈ కార్యదర్శి ఎస్‌సీఎల్ దాస్ నియామకం! చైనాలో మాస్టర్‌కార్డ్, సిటీగ్రూప్‌లకు మార్కెట్ అనుమతులపై అమెరికా ఒత్తిడి: బ్యాంకాక్ ద్వైపాక్షిక భేటీల్లో కీలక అంశం 100 డాలర్ల మార్కును దాటిన అమెరికా క్రూడాయిల్: హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడుల తీవ్రత.. ఈ వారంలో డబ్ల్యూటీఐ 9 శాతం జంప్! నకిలీ పోలీస్ అవతారం ఎత్తి మోసం నిర్మలా సీతారామన్ వాణిజ్య అడ్డంకుల ప్రస్తావనపై స్పందించిన చైనా: పరస్పర ఆర్థిక ఆందోళనల పరిష్కారానికి సిద్ధమని ప్రకటన! అమెరికాలో 330.5 బిలియన్ డాలర్ల భారతీయ పెట్టుబడులు: అధికారిక జాబితాను విడుదల చేసిన వైట్‌హౌస్.. ప్రపంచానికి 800 మిలియన్ల ఉద్యోగాల లోటు: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా హెచ్చరిక.. ఉపాధి సంక్షోభ పరిష్కారానికి సమగ్ర బ్లూప్రింట్ దేశంలోనే అతిపెద్ద ఐపీవో: జియో ప్లాట్‌ఫామ్స్ ప్రైస్ బ్యాండ్ రూ. 1,065–1,119గా ఖరారు.అక్టోబర్ 21న ప్రారంభం కానున్న మెగా పబ్లిక్ ఇష్యూ ఐసీఐసీఐ లాంబార్డ్ క్యూ2 ఫలితాలు: నికర లాభంలో 15 శాతం వృద్ధి.. ఒక్కో షేరుకు 7 రూపాయల డివిడెండ్ ప్రకటన! ఇజ్రాయెల్ నిబంధనలకు ఎయిర్ ఫ్రాన్స్ మొగ్గు.. ద్రవ్యోల్బణానికి రక్షణగా నిలవని బంగారం: వారం రోజుల కనిష్టానికి పడిపోయిన స్పాట్ గోల్డ్.. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు భయాలతో అమ్మకాల ఒత్తిడి

పూల పండుగతో పులకించిన మందమర్రి కోర్టు ప్రాంగణం

Select Suryaa Now
పూల పండుగతో పులకించిన మందమర్రి కోర్టు ప్రాంగణం

సూర్య, మందమర్రి.:తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మహిళల ఆత్మగౌరవానికి, ఐక్యతకు, ప్రకృతితో మానవ జీవనానికి ఉన్న అనుబంధానికి నిదర్శనమని మందమర్రి కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి నిరోషా అన్నారు. పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన ఏడో రోజు వేపకాయల బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. వివిధ రకాల రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు కోర్టు ప్రాంగణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. పూల పరిమళాలు, బతుకమ్మ పాటలతో కోర్టు ప్రాంగణమంతా పండుగ శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా న్యాయమూర్తి నిరోషా మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ కేవలం పూలను పూజించే వేడుక మాత్రమే కాదని, తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, కుటుంబ అనుబంధాలకు, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రకృతిలో లభించే పూలతో బతుకమ్మను పేర్చి పూజించడం ద్వారా ప్రకృతి పట్ల కృతజ్ఞతను చాటుకుంటామని తెలిపారు. ఇటువంటి సాంస్కృతిక వేడుకలు పరస్పర గౌరవం, సోదరభావాన్ని పెంపొందించడంతోపాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా న్యాయవాదులు సమత, సుమలత, ప్రసన్న, పల్లవి, మౌనిక, రజితతో పాటు మందమర్రి బార్‌ ప్రెసిడెంట్‌ చిరంజీవి, న్యాయవాదులు మేకల రామన్న, కట్ల శ్రీనివాస్‌, అశోక్‌, జి. రవి, ఆర్. రాములు, సెల్వరాజ్‌, లక్ష్మణ్‌, మధుకర్‌, ఏ. సత్యనారాయణ, వడ్లకొండ రంజిత్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.