కళ్యాణదుర్గం మున్సిపాలిటీపై వైఎస్ఆర్సిపి జెండా ఖాయం - సమిష్టి నిర్ణయంతో బరిలోకి బలమైన అభ్యర్థి దొడగట్ట హర్షిణి
అనంతపురం బ్యూరో (మేజర్ న్యూస్) : కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికల బరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థిగా దొడగట్ట నారాయణ కుమార్తె హర్షిణిని బరిలోకి దించుతూ పార్టీ తీసుకున్న నిర్ణయం స్థానిక రాజకీయాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. గెలుపే లక్ష్యంగా నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య రచించిన ఈ వ్యూహం, క్షేత్రస్థాయిలో పార్టీకి కొండంత బలాన్ని ఇస్తోంది.
ఈ అభ్యర్థి ఎంపిక కేవలం పైస్థాయి నిర్ణయం కాకుండా, నియోజకవర్గ అగ్రనేతలు బోయ తిప్పేస్వామి, మాదినేని ఉమామహేశ్వర నాయుడు ల సమిష్టి ఆలోచనతో జరిగింది. నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త, నాయకుడి మనోగతాన్ని, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, అందరి ఆమోదంతోనే హర్షిణిని బలమైన అభ్యర్థిగా ఎంపిక చేశారు. నాయకత్వంలోని ఈ ఐక్యత, సమిష్టి నిర్ణయం వైఎస్ఆర్ సీపీ శ్రేణుల్లో మునుపెన్నడూ లేని ఉత్సాహాన్ని నింపింది.
అభ్యర్థి హర్షిణి తండ్రి దొడగట్ట నారాయణకు కళ్యాణదుర్గం పట్టణంలో నాలుగు దశాబ్దాలుగా పైగా విస్తృత స్థాయిలో పరిచయాలు, బలమైన ప్రజా సంబంధాలు ఉన్నాయి. మూడు దశాబ్దాలుగా ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామి అవుతూ ఆయన సంపాదించుకున్న సత్కీర్తి, నమ్మకం ఇప్పుడు హర్షిణికి పెద్ద అసెట్ గా మారాయి. పట్టణ ప్రజలతో దొడగట్ట కుటుంబానికి ఉన్న ఈ విడదీయరాని అనుబంధం హర్షిణి విజయానికి తిరుగులేని పునాది వేయనుంది.
యువత, మహిళా కోటాలో విద్యావంతురాలైన హర్షిణి అభ్యర్థిత్వం వైపు పట్టణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు మొగ్గు చూపుతున్నారు. తలారి రంగయ్య చతురత, అగ్రనేతల అండదండలు, దొడగట్ట కుటుంబానికి ఉన్న సుదీర్ఘ ప్రజాదరణ వెరసి – కళ్యాణదుర్గం మున్సిపాలిటీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించి, జెండా ఎగరేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రిపోర్టర్ సుధా మోహన్, కళ్యాణదుర్గం ఇన్చార్జ్, కళ్యాణదుర్గం.