తాడిపత్రిలో ఆంక్షలు - 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలు…
తాడిపత్రి, (మేజర్ న్యూస్) : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో తాడిపత్రి పట్టణంలో ఆంక్షలు విధిస్తున్నట్లు తాడిపత్రి డీఎస్పీ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
నేడు , రేపు జరగనున్న నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు సంబంధిత చట్టపరమైన 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలు చేస్తున్నట్లు తెలిపారు.కావున
నామినేషన్ కేంద్రాల వద్ద, పరిసర ప్రాంతాల్లో నలుగురికి మించి వ్యక్తులు గుమిగూడరాదని సూచించారు. నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థితో పాటు నిబంధనల ప్రకారం అనుమతించబడిన ఇద్దరు ప్రతిపాదకులు (ప్రపోజర్స్ ) మాత్రమే రావాలని స్పష్టం చేశారు. ఇతర వ్యక్తులు గుంపులుగా రావడానికి అనుమతి ఉండదని తెలిపారు.
నామినేషన్ కేంద్రాల వద్ద అనవసరంగా గుమిగూడడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, ఎన్నికల విధులకు ఆటంకం కలిగించే చర్యలకు పాల్పడడం నిషేధమని పేర్కొన్నారు. అమలులో ఉన్న ఆంక్షలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని తాడిపత్రి డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.