శ్రీవారిని దర్శించుకున్న 77 వేలకు పైగా భక్తులు
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచివున్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు సుమారు 12 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా, నిన్న ఒక్కరోజే శ్రీవారిని మొత్తం 77,759 మంది భక్తులు దర్శించుకోగా, వారిలో 28,977 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.96 కోట్లుగా నమోదైనట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు.