తాడిమర్రి అమ్మవారి ఆలయంలో పూజల్లో పాల్గొన్న ఎస్ఐ కృష్ణవేణి
తాడిమర్రి మేజర్ న్యూస్: తాడిమర్రి మండలంలోని అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ కృష్ణవేణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు ముంటి మడుగు వెంకట ప్రసాద్ , ముంటి మడుగు హర్షవర్ధన్, ముంటి మడుగు వినోద్కుమార్, మండల ఆర్యవైశ్య న్యాయ సలహాదారు బండారు వెంకటేశు తదితరులు పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన ఎస్ఐ కృష్ణవేణికి కార్యక్రమ నిర్వాహకులు స్వాగతం పలికారు .