BREAKING
డాటా సెంటర్ల ఏర్పాటుతో షాద్నగర్ ప్రాంతం అతలాకుతలం పశ్చిమాసియా సంక్షోభం వేళ బాగ్దాద్‌కు ఇరాన్ విదేశాంగ మంత్రి: ఓఐసీ అత్యవసర సదస్సులో పాల్గొననున్న అబ్బాస్ అరఘ్చీ.. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ బలగాలు తక్షణమే వెనక్కి తగ్గాలి: ఖతార్ విదేశాంగ మంత్రి తీవ్ర హెచ్చరికలు.. ఇరాన్‌పై అణుదాడి అవకాశాన్ని కొట్టిపారేసిన డొనాల్డ్ ట్రంప్: శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గా భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దంపతులు పట్లోళ్ల అనుపమ సంజీవరెడ్డి పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు: హెబ్రోన్‌లో ఇజ్రాయెల్ సెట్లర్ల బీభత్సం.. ఇరాన్‌పై అణుదాడిని తోసిపుచ్చిన ట్రంప్! మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ అనంతపురం నగర రాజకీయాల్లో మేయర్ అభ్యర్థి భేటీకి ప్రాధాన్యం అనంతపురం మేయర్ అభ్యర్థి బి.సి. రమేష్ గౌడ్‌కు ఈడిగ (గౌడ) సంఘం మద్దతు రష్యా ఆయిల్ కొనుగోళ్లపై భారత్, చైనాకు ట్రంప్ ఊరట.. ముంబైలో జైశంకర్‌తో రూబియో భేటీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు, విదేశాంగ మంత్రిని 'ఉద్యోగి'తో పోల్చిన వైనం.. వివరణ ఇచ్చిన విదేశాంగ శాఖ! రాజ్‌నాథ్ సింగ్ ‘రెజీమ్ ఛేంజ్’ వ్యాఖ్యలపై కపిల్ సిబల్ ఎదురుదాడి: ప్రజలే అధికార మార్పు కోరుకుంటున్నారు.. 'మీరు దిగిపోయే సమయం వచ్చింది!' కళ్యాణదుర్గం మున్సిపాలిటీపై వైఎస్ఆర్సిపి జెండా ఖాయం - సమిష్టి నిర్ణయంతో బరిలోకి బలమైన అభ్యర్థి దొడగట్ట హర్షిణి పుదుచ్చేరిని ముంచెత్తిన భారీ వర్షాలు: జలదిగ్బంధంలో ప్రధాన రహదారులు.. స్తంభించిన ట్రాఫిక్.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం! ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం: 15 అడుగుల లోతైన కాలువలోకి దూసుకెళ్లిన మినీబస్సు.. నలుగురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు! చేవెళ్లలో ఘనంగా విరామ బైబిల్ పాఠశాల కార్యక్రమం

పట్టణాల్లో 30 యాక్ట్, 144 సెక్షన్ అమల్లో ఉంది. నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు. జిల్లా ఎస్పీ.

Select Suryaa Now
పట్టణాల్లో 30 యాక్ట్, 144 సెక్షన్ అమల్లో ఉంది. నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు. జిల్లా ఎస్పీ.

కళ్యాణదుర్గం :-జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ పటిష్ఠ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా  కళ్యాణదుర్గం, రాయదుర్గం పట్టణాల్లో 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమల్లో ఉన్నాయని జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్ వెల్లడించారు. అమల్లో ఉన్న నిబంధనలకు అనుగుణంగా ప్రజలు వ్యవహరించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పోలీసు శాఖకు సహకరించాలని సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, బహిరంగ సభలు నిర్వహించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. అలాగే ఐదుగురికి మించి గుమిగూడి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడరాదని హెచ్చరించారు. చట్ట నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ప్రజా శాంతికి భంగం కలిగించే విధంగా వ్యవహరించవద్దని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, వివిధ సంస్థల నాయకులు తమ కార్యక్రమాలను నిర్వహించే ముందు సంబంధిత పోలీసు అధికారుల నుంచి అవసరమైన అనుమతులు పొందాలని సూచించారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు, ధర్నాలు నిర్వహించడం ద్వారా ప్రజలకు ఇబ్బందులు కలగడంతో పాటు శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. పోలీసు శాఖ విధించిన ఆంక్షలను ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే వారిని ఉపేక్షించబోమని ఎస్పీ హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమించే వ్యక్తులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల భద్రత, ప్రశాంత వాతావరణం, సాధారణ జనజీవనానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీసు శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో శాంతియుత వాతావరణాన్ని కాపాడటం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత కూడా అని ఎస్పీ తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, యువత, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలిసినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. చట్ట నిబంధనలను గౌరవిస్తూ ప్రజలందరూ సంయమనం పాటించాలని, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని ఎస్పీ పి. జగదీష్ కోరారు.

కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :-రంగస్వామి.