మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ అనంతపురం నగర రాజకీయాల్లో మేయర్ అభ్యర్థి భేటీకి ప్రాధాన్యం
అనంతపురం బ్యూరో (అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్) : అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థి బి.సి. రమేష్ గౌడ్, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డితో రమేష్ గౌడ్ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ మర్యాదపూర్వక భేటీలో పరస్పరం అభివాదాలు చేసుకుని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, నగర అభివృద్ధి, ప్రజా సమస్యలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. మేయర్ అభ్యర్థిగా రమేష్ గౌడ్ ఎంపిక నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
అనంతపురం నగరంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్న తరుణంలో ఈ భేటీ చోటుచేసుకుంది. అయితే, ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.