టిడిపి జెడ్పిటిసి అభ్యర్థిగా అట్టా నాగమణి పేరు ప్రకటించాలి జిల్లా
జిల్లా కమిటీకి సిఫార్సు చేసిన మండలంలో పలువురు నాయకులు .
మండల జడ్పిటిసిగా అట్టా నాగమణి పేరును తామంతా జిల్లా అధిష్టానానికి సూచించామని పరవాడ నాయకులు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు పరవాడ మండలంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్న అట్ట సన్యాసి అప్పారావు భార్య నాగమణికి జడ్పిటిసి టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తే బాధ్యత తమ అంతా తీసుకుంటామని జిల్లా పార్టీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబుకు వినతిపత్రం అందించమని తెలిపారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన అట్టా సన్యాసి అప్పారావు భార్యకు జడ్పిటిసి టికెట్ ఇవ్వడం సమంజసమని పలువురు టిడిపి నాయకులు అంటున్నారు.
పరవాడ ,మేజర్ న్యూస్: