BREAKING
సరస్వతి దేవి అవతారంలో దర్శనం ఇచ్చిన అమ్మవారు డాలర్ బలహీనత, స్టాక్ మార్కెట్లలో తగ్గుదల అవనాపు కుటుంబానికి దక్కిన గౌరవం సర్దార్ నగర్‌లో బోల్తాపడిన సిమెంట్ క్రషర్ లారీ 32 వార్డు తేదీపై అభ్యర్థి అనంత వైఎస్సార్‌సీపీలో నూతనోత్సాహం జిల్లా అధ్యక్షుడిని కలిసిన మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ బుమ్రా, వాషింగ్టన్, నితీష్ రెడ్డి రీఎంట్రీ కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థలకు బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల ఆర్థిక ఊతం నామినేషన్ కేంద్రాన్ని పర్యవేక్షించిన డిఐజి కోయ ప్రవీణ్! రష్యా మంత్రి ప్రసంగ సమయంలో వాకౌట్ చేసిన డెలిగేట్లు ఉక్రెయిన్ ఆర్థిక సహాయం నిలకడ కోసం జర్మనీలో అప్పుల పరిమితి సడలింపు డిమాండ్ తాండూరులో పోలీసుల మెరుపు తనిఖీలు.. 42 వాహనాలు స్వాధీనం ఫ్రాన్స్‌లో వీధుల్లోకి విద్యార్థులు, కార్మిక సంఘాలు మరియు ఎల్లో వెస్ట్స్ నిరసనకారులు ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల రథయాత్రను విజయవంతం చేయాలి-రెడ్డి జేఏసీ నాయకులు రాయదుర్గం మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు పటిష్ట బందోబస్తు నలుగురు ఎస్సైలు, 35 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు

కూటమి ప్రభుత్వం కుట్రలకు భయపడేది లేదు కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి

Select Suryaa Now
కూటమి ప్రభుత్వం కుట్రలకు భయపడేది లేదు కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి

*కూటమి ప్రభుత్వం కుట్రలకు భయపడే ప్రసక్తే లేదు: మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి*

*కడప: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో కడప నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా కు శనివారం పోలీసులు నోటీసులు అందించారు.*

*ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇతర వ్యక్తులను ఉపయోగించుకుని దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతూ ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.*

*కుట్రలు, బెదిరింపులకు భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొని, మా అభ్యర్థుల నామినేషన్ల హక్కులను కాపాడుకుంటాం అని నాయకులు స్పష్టం చేశారు.*

*కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, పోలీసులను ఉపయోగించి ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా భయపడే ప్రసక్తే లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొని, మా అభ్యర్థుల నామినేషన్ హక్కుల కోసం పోరాడతాం” అని నాయకులు స్పష్టం చేశారు.*

ప్రజాస్వామ్యంలో ప్రతి అభ్యర్థికి స్వేచ్ఛగా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉండాలని, ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా సాగేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

 కడప క్రైమ్ రిపోర్టర్, వేణు.