BREAKING
వినాయక్ నగర్, నేరేడ్‌మెట్‌లో వైభవంగా దేవీ శరన్నవరాత్రులు: పూజల్లో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు! మైసమ్మ సన్నిధిలో భక్తుల సందడి అమ్మవారి చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలి ఎగుమతిదారులకు ఫ్రీ ట్రేడ్ ఒప్పారాలపై అవగాహన అమ్మవారి ఆశీస్సులతో అందరూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి దేవీ మండపాలను దర్శించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ సరికొత్త రికార్డులు.. మూడు రోజుల్లో రూ.144 కోట్లు దాటిన ‘జైలర్ 2’ వసూళ్లు! బ్రిటన్ తీరంలో ముగిసిన 'కొంకణ్-26' నావికాదళ విన్యాసాలు బాక్సాఫీస్ వద్ద రాజ్ కుమార్ రావ్ ‘ప్రహార్’ జోరు.. రెండు రోజుల్లో రూ.5 కోట్లు దాటిన వసూళ్లు! సీషెల్స్‌లో ముగిసిన భారత నావికాదళ శిక్షణ స్క్వాడ్రన్ పర్యటన కార్వార్ నావికాదళ స్థావరంలో 'ప్రాజెక్ట్ సీబర్డ్' మౌలిక వసతుల ప్రారంభం బాక్సాఫీస్ వద్ద రౌడీ హీరో హవా.. రెండు రోజుల్లో రూ.16 కోట్లు దాటిన ‘రణబాలి’ వసూళ్లు! పండుగల సీజన్‌లో నకిలీ ఆఫర్లు, సైబర్ మోసాలపై జాగ్రత్త బాక్సాఫీస్ వద్ద 'నయీ నవేలీ' జోరు.. రూ.7 కోట్లు దాటిన యామీ గౌతమ్ మైథలాజికల్ ఫాంటసీ మూవీ వసూళ్లు! గ్వాలియర్‌లో ట్రక్కు అదుపుతప్పి 13 మంది మృతి, సంతాపం తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని అంతరిక్ష ప్రయోగంలో కొత్త చరిత్ర సృష్టించనున్న జపాన్

తాండూరులో పోలీసుల మెరుపు తనిఖీలు.. 42 వాహనాలు స్వాధీనం

Select Suryaa Now
తాండూరులో పోలీసుల మెరుపు తనిఖీలు.. 42 వాహనాలు స్వాధీనం

తాండూరు,మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ ఆదేశాల మేరకు తాండూరు సబ్ డివిజన్ డీఎస్పీ ఎన్. యాదయ్య ఆధ్వర్యంలో రాజీవ్ కాలనీలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 95 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని విస్తృత తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 33 ద్విచక్ర వాహనాలు, 9 త్రిచక్ర వాహనాలు కలిపి మొత్తం 42 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పాపిలాన్ డివైస్ సహాయంతో ఒక అనుమానిత వ్యక్తిని గుర్తించారు.రాజీవ్ కాలనీకి చెందిన సుమారు 150 మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు శాంతిభద్రతల పరిరక్షణ, వ్యక్తిగత భద్రత, నేరాల నివారణపై అవగాహన కల్పించారు. కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.ఈ సందర్భంగా డీఎస్పీ ఎన్. యాదయ్య మాట్లాడుతూ…. ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం, నేరాలను నియంత్రించడం, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన అవసరమైన పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించినప్పుడు ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ప్రజలు పోలీసులకు సహకరిస్తూ నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సంబంధాలను పెంపొందిస్తూ ప్రజల భాగస్వామ్యంతో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తాండూరు టౌన్ ఇన్‌స్పెక్టర్ పరమేశ్వర్, కరణ్‌కోట్ సీఐ ప్రవీణ్ కుమార్, సబ్ డివిజన్ ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.