అనంత వైఎస్సార్సీపీలో నూతనోత్సాహం జిల్లా అధ్యక్షుడిని కలిసిన మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్
అనంతపురం (అనంతపురం బ్యూరో అనంతపురం) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మేయర్ అభ్యర్థిగా బీసీ నాయకుడు రమేష్ గౌడ్ ఎంపిక కావడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. పార్టీ అధిష్ఠానం తనపై నమ్మకం ఉంచి మేయర్ అభ్యర్థిగా అవకాశం కల్పించడంతో రమేష్ గౌడ్ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసికట్టుగా పనిచేసి భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని రమేష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్లో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
పార్టీ పట్ల విధేయతతో పనిచేసిన నాయకుడికి మేయర్ అభ్యర్థిగా అవకాశం కల్పించడంపై వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం వ్యక్తమవుతోంది. రమేష్ గౌడ్ అభ్యర్థిత్వంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసేందుకు సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.