BREAKING
వినాయక్ నగర్, నేరేడ్‌మెట్‌లో వైభవంగా దేవీ శరన్నవరాత్రులు: పూజల్లో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు! మైసమ్మ సన్నిధిలో భక్తుల సందడి అమ్మవారి చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలి ఎగుమతిదారులకు ఫ్రీ ట్రేడ్ ఒప్పారాలపై అవగాహన అమ్మవారి ఆశీస్సులతో అందరూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి దేవీ మండపాలను దర్శించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ సరికొత్త రికార్డులు.. మూడు రోజుల్లో రూ.144 కోట్లు దాటిన ‘జైలర్ 2’ వసూళ్లు! బ్రిటన్ తీరంలో ముగిసిన 'కొంకణ్-26' నావికాదళ విన్యాసాలు బాక్సాఫీస్ వద్ద రాజ్ కుమార్ రావ్ ‘ప్రహార్’ జోరు.. రెండు రోజుల్లో రూ.5 కోట్లు దాటిన వసూళ్లు! సీషెల్స్‌లో ముగిసిన భారత నావికాదళ శిక్షణ స్క్వాడ్రన్ పర్యటన కార్వార్ నావికాదళ స్థావరంలో 'ప్రాజెక్ట్ సీబర్డ్' మౌలిక వసతుల ప్రారంభం బాక్సాఫీస్ వద్ద రౌడీ హీరో హవా.. రెండు రోజుల్లో రూ.16 కోట్లు దాటిన ‘రణబాలి’ వసూళ్లు! పండుగల సీజన్‌లో నకిలీ ఆఫర్లు, సైబర్ మోసాలపై జాగ్రత్త బాక్సాఫీస్ వద్ద 'నయీ నవేలీ' జోరు.. రూ.7 కోట్లు దాటిన యామీ గౌతమ్ మైథలాజికల్ ఫాంటసీ మూవీ వసూళ్లు! గ్వాలియర్‌లో ట్రక్కు అదుపుతప్పి 13 మంది మృతి, సంతాపం తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని అంతరిక్ష ప్రయోగంలో కొత్త చరిత్ర సృష్టించనున్న జపాన్

సంతా మా ఊరి సంత దసరా పండుగ వేళ కిటకిటలాడిన మేకల సంత

Select Suryaa Now
సంతా మా ఊరి సంత  దసరా పండుగ వేళ కిటకిటలాడిన మేకల సంత

 

తలకొండపల్లి, రంగారెడ్డి  : మండలంలోని ఎక్స్ రోడ్ సమీపంలో ప్రతి శనివారం జరిగే సంత దసరా పండుగ వేళ అత్యంత రద్దీగా మారింది. దసరా పండుగ సందర్భంగా మేకలు, పొట్టేళ్లను కొనుగోలు చేయడానికి జనం తండోపతండాలుగా సంతకు చేరుకున్నారు. వ్యాపారులు, రైతులు పెద్ద ఎత్తున మేకలను తీసుకురావడంతో సంత కిటకిటలాడింది. శనివారం తెల్లవారుజాము నుండే మేకలను, పొట్టేళ్లను, లారీలు, ఆటోలు, టాటా ఏస్ లలో తరలించి సంతకు తీసుకొచ్చారు. కొనుగోలుదారులు బేరసారాలు చేస్తూ తమకు నచ్చిన మేకలను కొనుగోలు చేశారు. చిన్న మేక రూ.8,000 నుండి రూ.12,000 వరకు, మంచి పొట్టేలు రూ.15,000 నుండి రూ.25,000 వరకు పలుకుతున్నట్లు వ్యాపారులు తెలిపారు. గత వారం కంటే ఈ వారం ధరలు రూ.2,000 నుండి రూ.3,000 పెరిగాయని చెబుతున్నారు. దసరా పండుగ కావడంతో మేకలకు మంచి ధర పలుకుతుందని వ్యాపారులు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంతకు తలకొండపల్లితో పాటు హైదరాబాద్, కల్వకుర్తి, ఆమనగల్లు, కందుకూరు, మహబూబ్ నగర్ ప్రాంతాల నుండి కూడా వ్యాపారులు, కొనుగోలుదారులు వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


- చెప్పిన తిరుపతి మేజర్ న్యూస్.