నవదుర్గ రూప బాలిక అర్చన కుమారి పూజ
జీలుగుమిల్లి, మేజర్ న్యూస్: దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా జీలుగుమిల్లిలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ జగదాంబ అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయం వద్ద నవదుర్గ రూప బాలికార్చన కుమారి పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు చిరంజీవి శర్మ, పూజారి ప్రసాద్ వేదమంత్రాల నడుమ కోలా రాము, పోసి కుమారి దంపతులు నవదుర్గ బాలికార్జున పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నవదుర్గామాతలుగ బాలికలను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ భాగ్యనగర క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్, సొసైటీ మాజీ కార్యదర్శి పసుపులేటి కృష్ణమోహన్, బిజెపి నాయకులు రాపాక గోపాలరావు, సమరసతా సేవ ఫౌండేషన్ ధర్మ విస్తారక్ బొంతు రామకృష్ణ, మహిళలు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు.
, రిపోర్టర్ : బొంతు రామకృష్ణ, జీలుగుమిల్లి ఏలూరు జిల్లా,