కట్టుదిట్టమైన భారీ పోలీసు బందోబస్తు మధ్య నామినేషన్లు ప్రక్రియ !
పుంగనూరు మేజర్ న్యూస్
పట్టణంలోని బసవరాజా జూనియర్ కళాశాల నందు శనివారం నామినేషన్ కొనసాగుతున్నది. నామినేషన్ కేంద్రం వద్దకట్టుదిట్టమైన భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నామినేషన్ కేంద్రం, పరిసర ప్రాంతాలపై అత్యాధునిక డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఉంచారు.శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసులు అప్రమత్తంగా ఉంటూ నామినేషన్ల ప్రక్రియను అత్యంత ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నారు.
రిపోర్టర్ :రెడ్డప్ప పుంగనూరు నియోజకవర్గ అన్నమయ్య జిల్లా