BREAKING
పూల సంబురానికి సిద్దమవుతున్న బతుకమ్మలు హిందీ రాకపోయినా క్లిష్టమైన గజల్స్ పాడిన దిగ్గజ సంగీత దర్శకుడు దేవా.. గాయని చిన్మయి ఎమోషనల్ పోస్ట్! మహబూబాబాద్ లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలి-జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యునికి బార్ అసోసియేషన్ వినతి పెనుకొండలో టీడీపీకి వైఎస్సార్‌సీపీ సవాల్.. చైర్మన్ బరిలో శ్రీనివాసులు! కోల్‌కతా దుర్గా పూజ తొక్కిసలాట విషాదం.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు! మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రొంగలా అనూష నామినేషన్ మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి ఘనవిజయం :ఎమ్మెల్యే కొండయ్య ఊరెళ్తున్నారా.. తస్మాత్‌ జాగ్రత్త! ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ పి. కిరణ్ తహసిల్దార్ కార్యాలయం లేక పార్టీ కార్యాలయమా-బి ఆర్ ఎస్ జిల్లా నాయకురాలు ధనలక్ష్మి నామినేషన్ల వేళ ముందస్తు అరెస్టులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ రికార్డు సునామీ.. 2026లోనే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా 'జైలర్ 2'! పోలేరమ్మ విగ్రహాప్రతిష్ట మహోత్సవం. వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలి:మాజీ సర్పంచ్ కావేరి మచ్చేందర్ రెడ్డి ప్రపంచ వేదికపై 'రామాయణం' రికార్డు.. లాస్ ఏంజిల్స్ అకాడమీ మ్యూజియంలో గ్రాండ్ వరల్డ్ ప్రీమియర్! వైయస్సార్ సిపి చైర్మన్ అభ్యర్థిగా రవికుమార్ నామినేషన్

యూత్ డిక్లరేషన్ హామీలు నెరవేర్చకుండా తెలంగాణ యువతను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం - బిజెపి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కాండిడేట్ రావు పద్మా రెడ్డి

Select Suryaa Now
యూత్ డిక్లరేషన్ హామీలు నెరవేర్చకుండా తెలంగాణ యువతను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం - బిజెపి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కాండిడేట్ రావు పద్మా రెడ్డి

హనుమకొండ, మేజర్ న్యూస్, యూత్ డిక్లరేషన్ పేరుతో తెలంగాణ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బిజెపి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కాంటెస్టెడ్ కాండిడేట్ రావు పద్మ రెడ్డి అన్నారు. యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ,  బీజేవైఎం హనుమకొండ జిల్లా అధ్యక్షులు పున్నం వేణు  ఆధ్వర్యంలో శనివారం కాజీపేట జంక్షన్ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.  కార్యక్రమానికి  రావు పద్మ రెడ్డి  ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలవుతున్నా యువతకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. వెంటనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేపట్టాలని,
నెలకు 4,000 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని,రాజీవ్ యువ వికాసం కార్డు పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.హామీలు ఇవ్వడం కాదు... వాటిని అమలు చేసే వరకు తెలంగాణ యువత పక్షాన బిజెవైఎం పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు.రాష్ట్రంలో సాగునీరు, విద్యుత్ కొరతతో రైతులు తీవ్ర అవస్థలు పడుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను గాలికొదిలేసి ‘ఓట్ చోరీ’ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. గాంధీ పేరును దొంగిలించిన నకిలీ గాంధీలు కాంగ్రెస్ నేతలని వ్యాఖ్యానించారు. భారత అభివృద్ధిని జీర్ణించుకోలేక, ప్రపంచ వేదికపై భారత్ అగ్రశక్తిగా ఎదుగుతుంటే తట్టుకోలేక దేశంలో అశాంతి సృష్టించేందుకు రాజ్యాంగబద్ధ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. "ఎన్నికలే అక్రమమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయడం లేదు, గెలిస్తే ఈవిఎంలు, ఎన్నికల సంఘం మంచివి... ఓడిపోతే మాత్రం అవే తప్పు అనడం వారి దిగజారుడు తనానికి నిదర్శనం" అని అన్నారు.గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం దోచుకుంటే, నేడు కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి మరియు ఆయన సోదరులు లాభపడుతున్నారని ఆరోపించారు. కమీషన్లు, కాంట్రాక్టుల కోసమే ఈ రెండు పార్టీలు పనిచేస్తున్నాయని, తెలంగాణను కాపాడి అభివృద్ధి బాటలో నడిపించే సత్తా ఒక్క భారతీయ జనతా పార్టీకే ఉందన్నారు. కార్యక్రమంలో బిజెపి, బిజెవైఎం జిల్లా నాయకులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బ్యూరో: పురుషోత్తం, హనుమకొండ జిల్లా