BREAKING
ఎన్నికల సామగ్రి కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కాంగ్రెస్ పార్టీలో చేరిన టిడిపి మాజీ కౌన్సిలర్ బిగ్‌బాస్ హౌస్‌లో అనూహ్య పరిణామాలు: త్రిగుణ్ డబుల్ గేమ్‌, కెప్టెన్‌గా రాంప్రసాద్‌ విజయం! అడెల్లి గంగనీళ్ల జాతరకు 250 మంది పోలీసులతో పటిష్ట భద్రత. : జోగాపూర్‌లో దొంగతనం అద్దంకిలో తెదేపా అభ్యర్థుల నామినేషన్ ర్యాలీ. పోలీస్‌ ఫ్లాగ్‌ డే సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీలు గరివిడి లక్ష్మి మూవీ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉందంటే? సంగీత ప్రపంచంలో తీరని లోటు: ప్రముఖ సంగీత దర్శకుడు ‘తేనిసై తెన్రల్’ దేవా కన్నుమూత పెద్దపల్లిలో వైభవంగా దసరా వేడుకలు: 35 అడుగుల రావణ దహనానికి ముస్తాబు ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు కుటుంబ సమేతంగా తరలిరావాలని ప్రజలకు ఆహ్వానం రామప్ప ను సందర్శించిన విదేశీయులు *లక్ష్మీదేవికి కుంకుమార్చనలు.. భక్తిశ్రద్ధలతో పూజలు** **దేశభక్త యువజన సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి వేడుకలు** లేని ప్రాజెక్టు పేరుతో సీతక్క ఇసుక దోపిడి-బి ఆర్ ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ శ్రీశైలంలో ఘనంగా దసరా

ఎండుతున్న పంటలకు ఎకరాకు రూ. 25 వేల పరిహారం ప్రకటించాలి

Select Suryaa Now
ఎండుతున్న పంటలకు ఎకరాకు రూ. 25 వేల పరిహారం ప్రకటించాలి

ఎండుతున్న పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి

రంగారెడ్డి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి


రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బాక రామచందర్

 

 

 


కందుకూరు: ఎండిపోతున్న పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని, రంగారెడ్డి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బాక రామచందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం కందుకూరు మండలం  నేదునూరు గ్రామ పరిధిలోని అక్బర్‌జా రెవెన్యూ పరిధిలో ఎండిపోయిన పంటలను రైతు సంఘం, సీపీఎం నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. వర్షాభావం, భూగర్భ జలాలు తగ్గిపోవడం, విద్యుత్ సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రానున్న పంటల సాగుకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించాలని, కందుకూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రజలకు తాగునీరు, పశుగ్రాసం అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, రైతు సంఘం, సీపీఎం పోరాటంతో అక్బర్‌జా రెవెన్యూ పరిధిలో అదనంగా 100 హెచ్‌పీ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరైందని, ఐదు విద్యుత్ స్తంభాలు, తీగలు ఏర్పాటు చేయడంతో రైతులకు విద్యుత్ సమస్య నుంచి కొంత ఉపశమనం లభించిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో   సీపీఎం మండల కమిటీ సభ్యులు బి శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సభ్యులు యాదయ్య, జిల్లా కమిటీ సభ్యులు మిద్దె. యాదయ్య గ్రామ కార్యదర్శి ఎస్ రాములు, రైతులు ఆర్ నరసింహ టి కృష్ణ బి శంకర్ ఏమి యాదయ్య పోచయ్య కలమ్మ శివ తదితరులు  పాల్గొన్నారు.


టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్