BREAKING
ఎన్నికల సామగ్రి కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కాంగ్రెస్ పార్టీలో చేరిన టిడిపి మాజీ కౌన్సిలర్ బిగ్‌బాస్ హౌస్‌లో అనూహ్య పరిణామాలు: త్రిగుణ్ డబుల్ గేమ్‌, కెప్టెన్‌గా రాంప్రసాద్‌ విజయం! అడెల్లి గంగనీళ్ల జాతరకు 250 మంది పోలీసులతో పటిష్ట భద్రత. : జోగాపూర్‌లో దొంగతనం అద్దంకిలో తెదేపా అభ్యర్థుల నామినేషన్ ర్యాలీ. పోలీస్‌ ఫ్లాగ్‌ డే సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీలు గరివిడి లక్ష్మి మూవీ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉందంటే? సంగీత ప్రపంచంలో తీరని లోటు: ప్రముఖ సంగీత దర్శకుడు ‘తేనిసై తెన్రల్’ దేవా కన్నుమూత పెద్దపల్లిలో వైభవంగా దసరా వేడుకలు: 35 అడుగుల రావణ దహనానికి ముస్తాబు ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు కుటుంబ సమేతంగా తరలిరావాలని ప్రజలకు ఆహ్వానం రామప్ప ను సందర్శించిన విదేశీయులు *లక్ష్మీదేవికి కుంకుమార్చనలు.. భక్తిశ్రద్ధలతో పూజలు** **దేశభక్త యువజన సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి వేడుకలు** లేని ప్రాజెక్టు పేరుతో సీతక్క ఇసుక దోపిడి-బి ఆర్ ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ శ్రీశైలంలో ఘనంగా దసరా

ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను రోడ్డుపైకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం-బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్-సమ్మెకు సంపూర్ణ మద్దతు

Select Suryaa Now
ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను రోడ్డుపైకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం-బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్-సమ్మెకు సంపూర్ణ మద్దతు

వరంగల్, మేజర్ న్యూస్, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్మరించారని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జాతీయ ఆరోగ్య మిషన్  కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకై వరంగల్ పోచంమైదాన్ కూడలిలో ఐదవ రోజుకు చేరిన నిరవధిక సమ్మెకు వారు హాజరై, బీజేపీ తరఫున సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మాట్లాడుతూ కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను రక్షించేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన కోవిడ్ వారియర్స్, ఎన్ హెచ్ ఎం వైద్యులు మరియు సిబ్బందిని నేడు తమ భవిష్యత్తు కోసం రోడ్డుపైకి లాగి నిరవధిక సమ్మె చేసేలా చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని మండిపడ్డారు. 'ప్రజా ప్రభుత్వం - ప్రజా పాలన' అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం, 17,000 మంది కుటుంబాల పొట్టగొడుతోందని అన్నారు.బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు మాట్లాడుతూ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు మరియు వారి రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రభుత్వం కింద పేర్కొన్న న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఉద్యోగులు చేస్తున్న  న్యాయపోరాటానికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వం స్పందించి చర్చలు జరపకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, జిల్లా కార్యదర్శి గోకే వెంకటేష్, దేశాయిపేట మండల అధ్యక్షులు విప్ప సుధాకర్, శివనగర్ మండల అధ్యక్షులు మహమ్మద్ రఫీ, సంగెం మండల అధ్యక్షులు చంద్రశేఖర్, బిజెపి నాయకులు మల్లికార్జున్ మరియు ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు, వైద్యులు, ఏఎన్‌ఎంలు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.

రిపోర్టర్,  విష్ణు,  పోచం మైదాన్ ,వరంగల్ జిల్లా