బేస్తం చెరువు వద్ద సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను కమిషనర్ వెంకన్న తో కలిసి పరిశీలించిన గుండు చందన పూర్ణచందర్
ఖిలా వరంగల్, మేజర్ న్యూస్, బెస్తంచెరువు వద్ద జరిగే సద్దుల బతుకమ్మ పండుగకు కార్పొరేషన్ పరంగా అన్ని ఏర్పాట్లను చేయాలని జిడబ్ల్యుఎంసీ కమిషనర్ టి వెంకన్న ను 42వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్ కోరారు.సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని బెస్తం చెరువు వద్ద చేస్తున్న పనులను కార్పొరేషన్ కమిషనర్ టి వెంకన్నతో కలిసి 42 వడివిజన్ మాజీ కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్ పరిశీలించినారు.
ఈ సందర్భంగా గుండు చందన పూర్ణచందర్ మాట్లాడుతూ సద్దుల బతుకమ్మ పండుగకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, పూర్తిస్థాయిలో లైటింగ్ తో పాటు సౌండ్ సిస్టం లను ఏర్పాటు చేయాలని కమిషనర్ ను కోరారు. ప్రమాదవశాత్తు ఎవరూ చెరువులో పడకుండా చెరువు చుట్టూ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ వారిచే తాత్కాలిక ఫెన్సింగ్ తో పాటు భారీ కేడింగ్ ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు.
కమిషనర్ టి వెంకన్న మాట్లాడుతూ ఈ ప్రాంతంలో చేస్తున్న పనులను ఆదివారం మధ్యాహ్నం వరకు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినారు. బతుకమ్మ ఆడుకోవడానికి వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజయ్, ఎం హెచ్ వో డాక్టర్ రాజేష్, డి ఈ సురేష్, ఎలక్ట్రికల్ డి ఈ సంతోష్, ఏఈ లు వరుణ్, గఫూర్, శానిటరీ ఇన్స్పెక్టర్ భీమయ్య, వర్క్ ఇన్స్పెక్టర్ వేణు లతోపాటు కాకతీయ సేవా సమితి అధ్యక్షుడు మండల నరసింహారాములు మరియు అధికారులు, మున్సిపల్ జవాన్లు ప్రశాంత్, శ్రీధర్, కృష్ణ, ప్రణీత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్, శ్రీనివాస్ , ఖిలా వరంగల్, వరంగల్ జిల్లా