BREAKING
ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను రోడ్డుపైకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం-బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్-సమ్మెకు సంపూర్ణ మద్దతు 28 వార్డు హరిజన లక్ష్మీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాయదుర్గం పెనుగొండలో మున్సిపల్ అభ్యర్థి ఎన్నికలు చెలరేజ్ గిన అసంతృప్తి ఎండుతున్న పంటలకు ఎకరాకు రూ. 25 వేల పరిహారం ప్రకటించాలి పంతంగి టోల్ గేట్ వద్ద బారులు తీరిన వాహనాలు శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు, డిసిసి అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కొండపల్లి ఇస్మాయిల్ 32 వార్డు వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థి రాయదుర్గం భ్రమరాంబిక అమ్మవారు.. మహాలక్ష్మి దేవి అవతారంలో దివ్యదర్శనం పెనుగొండ 20వ వార్డు తెదేపా 24 వార్డు గెనిగేరి నాగమ్మ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాయదుర్గం మంత్రి శ్రీధర్ బాబును మర్యాద పూర్వకంగా కలిసిన హనుమకొండ డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామిరెడ్డి ఇంకొల్లు మండలం జడ్పీటీసీ, ఎం.పి.పి, ఎం.పి.టి.సి రిజర్వేషన్లు ఇలా 36 వార్డు బుల్లారి చన్నవీరప్ప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాయదుర్గం కట్టుదిట్టమైన భారీ పోలీసు బందోబస్తు మధ్య నామినేషన్లు ప్రక్రియ ! పోలీసు ప్రేక్షక పాత్ర -ర‌క్ష‌ణ క‌ల్పించ‌క‌పోవ‌డం పోలీసుల వైఫ‌ల్యం -ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి

స్కాముల చరిత్ర బీఆర్‌ఎస్‌దే!

Select Suryaa Now
స్కాముల చరిత్ర బీఆర్‌ఎస్‌దే!

స్కాముల చరిత్ర బీఆర్‌ఎస్‌దే!

– కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు ధ్వజం

 సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా స్కీములతో ముందుకెళ్తుంటే, గత పదేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు, కుంభకోణాలకు పాల్పడిన బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు మండిపడ్డారు. శనివారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.​లక్షల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత లోపం వల్లే కుంగిపోయిందని, రైతులకు నీరందకపోవడానికి గత పాలకుల పాపమే కారణమని విమర్శించారు. గతంలో సెస్ (CESS)లో సుమారు ₹94 కోట్ల మేర జరిగిన నిధుల గోల్‌మాల్‌ను కప్పిపుచ్చుకునేందుకు రికార్డులు తగులబెట్టారని ఆరోపించారు.​కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్, రైతులకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ అందిస్తూ ఆదుకుంటోందని తెలిపారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా సీఎంపై, ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నరేష్, నాయకులు రాగుల జగన్, బోప్ప దేవయ్య, ఆకునూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు